పై ఫోటోలో కనబడుతున్న కుక్క పేరు బైలీ. పొట్టి కాళ్లు, గోధుమ&నలుపు రంగులలో ఉన్న ఈ శునకం చాలా తెలివైనది. ఇది ప్యూర్టో రికాన్ పాటకు నాట్యం చేస్తున్న ఒక మహిళ యజమాని వద్దకు వచ్చి ఆమెను ఎక్కిరిస్తూ కొన్ని డాన్స్ స్టెప్పులను వేసింది. దాంతో ఒక రాత్రి లోనే ఇంటర్నెట్ స్టార్ అయ్యింది. 


వివరాల్లోకి వెళితే... ఆ పెద్దావిడ పేరు విండీ బిరేంగుర్, అమెరికాలోని ఫ్లోరిడాలో నివసిస్తుంది. అయితే, తాజాగా ఆమె ఒక పాటకు తన కిచెన్ లో డాన్స్ చేయడం ప్రారంభించింది. ఆ సందర్భంలోనే బైలీ కుక్క వంట గదిలోకి వచ్చి ఆమె ముందు నిల్చొని నాట్యం చేయడం స్టార్ చేసింది. విండీ ఎలా డాన్స్ చేస్తుందో.. దానికి కొంచెం భిన్నంగా ఆమెను ఎక్కిరిస్తూ తల, ముందు కాళ్ళు అటు ఇటు ఊపుతూ ఆశ్చర్యపరిచింది.
 

https://mobile.twitter.com/rahm3sh/status/1204855246872334336


కొన్ని సెకండ్ల తర్వాత, బైలీ తన నాట్యాన్ని వీడియో తీస్తున్నారని గ్రహించి... కెమెరా వైపు తిరిగి.. 'విండీ ఎలా డాన్స్ చేస్తుందో చూడండి' అని శునక సైగలు చేస్తూ భలే డాన్స్ చేసింది. అరనిమిషం అలా చేసిన తర్వాత బైలీ అక్కడ నుంచి వెళ్ళిపోయింది. అయితే, ఈ అరుదైన దృశ్యాలను ఒక వీడియో లో బంధించి... దానిని విండీ తన ఫేసు బుక్ ఖాతాలో అప్లోడ్ చేసింది. అతి తక్కువ సమయంలోనే ఈ వీడియో క్లిప్ తెగ వైరల్ అయ్యింది. ఆ తర్వాత ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ అంటూ అనేక రకాల సోషల్ మీడియా సైట్లలో అప్లోడ్ అవ్వబడింది. కుక్క టాలెంట్ ను చూసి కొంతమంది నెటిజన్లు నోరెళ్లబెట్టగా, మరికొందరు ఏంటీ ఈ కుక్క అంటూ షాక్ అవుతున్నారు.
https://mobile.twitter.com/rhymeswith69/status/1204997678242779137
ప్రస్తుతానికి ఈ వీడియో కి ఫేసుబుక్కులో 15 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ట్విట్టర్ లో కూడా 15 లక్షల వ్యూస్, 7 లక్షల లైకులు, 2 లక్షల షేర్లు వచ్చాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: