ఒక్క వీడియోతోనే ఒకే రోజులో రణు మొండాల్‌ అనే మహిళ ఇంటర్నెట్ సెలబ్రిటీ అయిన విషయం విధితమే. ఇంకా, ఆమె కంటే ఎక్కువ టాలెంట్ ఉన్న వారు చాలామంది ఉన్నారన్నది ఈ వీడియో చూస్తే తెలుస్తుంది.


పై ఫొటోలో కనిపిస్తున్నది కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఒక సాధారణ రైతు. ఒక పారా పట్టుకొని తల చుట్టూ ఒక గుడ్డు కట్టుకొని తన పొలంలో పని చేసుకుంటున్నాడు. అయితే ఒక వ్యక్తి అతని వద్దకు వచ్చి, 'మీరు ఇంగ్లీష్ పాటలు బాగా పాడుతారంటగా, నాకోసం ఒకసారి పాడతారా' అని అడిగాడు. ఆ రైతు సమాధానమిస్తూ, 'లేదు, నాకేం ఇంగ్లీష్ రాదు. నేను ఇప్పుడు పాడాను. పనిలో ఉన్న' అంటూ కన్నడ భాషలో చెప్పాడు. కానీ ఆ వ్యక్తి.. ప్లీజ్ ఒకసారి పాడండి సార్ అంటూ కోరాడు. దాంతో, అతనిని నొప్పించకూడదని భావించిన ఆ రైతు సరే పాడుతా అని చెప్పాడు.


https://mobile.twitter.com/thakur_shivangi/status/1206834479693803521


ఆ తర్వాత కొన్ని సెకనుల పాటు వామ్ అప్ అయ్యాడు. ఇక తన అద్భుతమైన రాగంతో, మెచ్చుకోదగ్గ నాట్యంతో ఒక పేరు గాంచిన ఆంగ్ల పాటను ఆలపించాడు. అస్సలు ఎవరూ ఉహించలేనంతంగా అతను ఆ పాటను ఆలపించి, తగిన డాన్స్ మూవ్స్ చేస్తూ మంత్రముగ్దుల్ని చేశాడు.


https://mobile.twitter.com/kirankrtamang/status/1206973485311877125



ఈ రైతు పాడిన పాటని వీడియో తీసి, దాన్ని యూట్యూబ్ లో అప్లోడ్ చేశాడు ఆ రైతుని కోరిన వ్యక్తి. ఇక ఆ వీడియో చూసిన 4లక్షల మంది.. అచ్చం ఒరిజినల్ సింగర్ పాడినట్లే పాడాడు. ఇతనికి సూపర్ టాలెంట్ ఉంది, ఈ వీడియో ని 10 సార్లు చూసిన ఇంకా చూడాలనిపిస్తుందని కామెంట్లు చేస్తున్నారు.


ఇంతకీ ఈ రైతు పాడిన పాటేంటంటే... ప్రముఖ కెనడియన్ సింగర్ 'జస్టిన్ బీబర్(25)' ఆలపించిన 'బేబీ' సాంగ్. ఈ పాటలో జస్టిన్ ఒక అమ్మాయి ని ప్రేమిస్తాడు కానీ ఆమె వేరే అబ్బాయిని ప్రేమిస్తుంది. ఇది తెలిసిన జస్టిన్ అది నమ్మలేక, ఇంకా తట్టుకోలేక, ఆమెపై అతనికి ఉన్న ప్రేమని మర్చిపోవడానికి బాగా ట్రై చేస్తుంటాడు.


https://mobile.twitter.com/hitsatemporal/status/1206973442601435137

మరింత సమాచారం తెలుసుకోండి: