పెళ్లి రిసెప్షన్ వేడుకలో వరుడు రచ్చ రచ్చ చేసాడు. వేడుక మొదటినుంచి ముభావంగా కనిపించిన వరుడు చివరికి తను సహనం కోల్పోయి వింతగా ప్రవర్తించి వేడుకకు వచ్చిన అతిథులతో వీడి కోపం తగలెయ్య అని అనిపించుకున్నాడు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ వీడియో కాస్తా నెట్టింట్లో వైరల్ అయింది. 

 

పేస్ బుక్ లో 'బస్సీ ఈజ్ ఏ బ్యాడ్ గర్ల్' అనే వీడియోను పోస్ట్ చేశారు. ఇక ఈ వీడియోలో పెళ్లి రిసెప్షన్ జరుగుతున్న దృశ్యాలు ఉన్నాయి. వరుడు, వధువు ఇద్దరు ఒక పెద్ద కేక్ ముందు నిలబడి దాన్ని కట్ చేస్తున్నారు. వరుడు చాక్ తీసుకుని కేక్ ను కట్ చేయడానికి ప్రయత్నించగా అది కట్ అవ్వలేదు. మరోసారి ప్రయత్నించగా కేక్ కట్ అవ్వడంతో ఊపిరిపీల్చుకున్నాడు ఇంతలో ఆ ముక్కను ఒకావిడ తన భార్యకు తినిపించాడనికి ప్రయత్నించగా ఆవిడ చేతిలో ఉన్న ప్లేట్ ను లాక్కొని మనోడు కేక్ ముక్కను వధువుకు తినిపించాడు.

 

ఆ తరువాత ఒక షాంపైన్ బాటిల్ తీసుకుని రిసెప్షన్ కు వచ్చిన వారిపై చిమ్ముదాం అనుకున్నాడు కానీ బాటిల్ ఓపెన్ అవ్వలేదు మనోడికి, మళ్ళీ ప్రయత్నించాడు అయినా ఓపెన్ అవ్వలేదు. వధువు ముందు పరువు పోయింది అనుకున్నాడో ఏమో ఉన్నటుండి అయ్యగారికి కట్టలు తెగిపోయే ఆగ్రహం వచ్చింది. వెంటనే చేతిలో ఉన్న షాంపైన్ బాటిల్ ను నేలకేసి కొట్టి తన కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేసాడు. షాంపైన్ బాటిల్ ను నేలకేసి కొట్టడంతో వధువు సహా అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. వీడి కోపం తగలెయ్య ఇంకా నయం ఆ కేక్ కట్ చేసే కత్తితో పీక కోసుకోలేదు అనుకుంటూ రిసెప్షన్ కు హాజరయిన కుటుంబ సభ్యులు, వధువు స్నేహితురాళ్ళు ముక్కున వేలేసుకున్నారు. ఇంతలా నెట్టింట్లో వైరల్ అయిన ఈ వీడియోను మీరు చూసేసి నవ్వేయండి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: