తెలంగాణలోని వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం నాగసమందర్ గ్రామంలో భీమయ్య అనే రైతు ఉపాధి కోసం కడక్నాథ్ కోళ్లను తెచ్చుకుని ఇంటి దగ్గర పెంచుకుంటున్నాడు. కేజీ రూ. 800 ఖరీదు చేసే కోళ్లను అప్పు చేసి మరీ తీసుకొచ్చి పెంచుకుంటుంటే దుష్ట దొంగలు వాటిని చంపి తినేశారని రైతు భీమయ్య వాపోయాడు.

 

చివరకు కోళ్ల దొంగలను పట్టుకునేందుకు వేట మొదలుపెట్టినా ప్రయోజనం లేకుండా పోయిందన్నాడు. రోజుకు ఒక్కో కోడి చొప్పున మొత్తం 10 కోళ్లను దొంగిలించి తినేశారని నెత్తిన చేయి పెట్టుకుని ఉసూరుమంటూ చెప్పాడు.. కడకనాధ్ కోళ్ళకి మంచిది డిమాండ్ ఉంది..

 

వాటిలో పోషక విలువలు చాలా ఉంటాయి. అందుకే ఆ కోడి మాంసం మాములు కోడి కన్నా ధర ఎక్కువ.. మాంసం కూడా చాలా రుచిగా ఉంటుంది.. అందుకే దుండగలు కాపు కాచి మరియు దొంగతనం చేసి తినేస్తున్నారు. కోళ్ల దొంగల్ని ఎలాగైనా పట్టుకోవాలని ఆ రైతు విశ్వప్రయత్నాలు చేసినా.. వారు మాత్రం చిక్కకుండా చుక్కలు చూపించి ‘లాగించేశారు. తాను పెంచే కోళ్లు కేజీ రూ. 800 ధర పలుకుతుందని బాధిత రైతు చెబుతున్నాడు.

 

అయితే ఒక కోడి తర్వాత మరొకటి చొప్పున 10 కోళ్లను దొంగలు ‘సఫా’ చేసేశారని ఆ రైతు వాపోయాడు... మొత్తం ఒకేసారి కాకుండా ఒకదాని తరువాత మరొకటి గా మొత్తం 10 కోళ్లు ఎత్తుకుపోయారని వాపోయారు. అప్పు చేసి మరి జీవనోపాధి కోసం కోళ్ళని పెంచుతున్నానని, ఒకదాని తర్వాత ఒకటిగా కోళ్ళని పోతుంటే జీవనం ఎలా సాగించాలని ఆందోళన చెందుతున్నాడు భీమయ్య.. ఈ పది కోళ్ల తో అయిన దొంగతనం ఆగుతుందా? లేక మళ్ళీ కోళ్ళని పోగొట్టుకోవాలా !!అన్నా అయోమయంలో ఉన్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: