18 ఏళ్ల అమ్మాయి తన రొమ్ములు చిన్నవిగా ఉన్నాయని, సర్జరీ చేయించుకొని... రొమ్ములతో పాటు సెల్ఫ్ కాంఫిడెన్స్ పెంచుకుందామని అనుకుంది. కానీ విధి వక్రించి, రొమ్ములు పెంచుకోవాలనే ఆమె కొరిక తన జీవితాన్ని గుగ్గిపాలు చేసింది. ఎలాగో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.


వివరాల్లోకి వెళితే.. కొలరాడోలోని తోర్‌న్టన్‌కు చెందిన ఎమ్మాలిన్ న్గుయెన్ (18) తన చిన్న సైజు రొమ్ములను చూస్తూ ప్రతిరోజూ కుమిలిపోయేది. ఎమ్మాలిన్ తల్లిదండ్రులు తన కూతురు రోజూ కుములిపోతుంటే చూడలేకపోయారు. దాంతో ఎమ్మాలిన్ తన హైస్కూల్ చదువు పూర్తిచేయగానే.. బ్రెస్ట్ ఇంప్లాంట్ సర్జరీ చేయిద్దామని నిర్ణయించుకున్నారు. చదువు పూర్తి అవ్వగానే.. ఆగస్టు నెలలో ఎమ్మాలిన్ ని కొలరడాడో ఈస్తటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ క్లీనిక్‌లో చేర్పించారు. అయితే, బ్రెస్ట్ ఇంప్లాంట్ సర్జరీకి రూ.4 లక్షల 30 వేలు అవుతాయని అక్కడి డాక్టర్ జాఫరీ చెప్పాడు. సరే, ఆపరేషన్ ప్రారంభించండని బాలిక తల్లిదండ్రులు అన్నారు.



మధ్యాహ్నం 2గంటల సమయంలో.. సర్జరీలో భాగంగా అనస్థీషియా నిపుణుడు ఆమెకు మత్తుమందు ఇచ్చి వెళ్లిపోయాడు. 15నిముషాలు తరువాత డాక్టర్ జాఫరీ వచ్చి చూస్తే... ఆమె అపస్మారక స్థితిలో కనిపించింది. జాఫరీ వెంటనే ఆ హాస్పిటల్ సిబ్బందిని పిలిచాడు. కానీ అంతలోపే ఎమ్మాలిన్ గుండె కొట్టుకోవడం ఆగిపోయింది, దాంతో మెదడుకి రక్తసరఫరా పూర్తిగా నిలిచిపోయింది. బాలిక పరిస్థితిని గుర్తించిన వైద్య సిబ్బంది సీపీఆర్ (గుండె ఆగినప్పుడు చేసే ప్రాథమిక చికిత్స) నిర్వహించారు. బాలిక కొంచెం స్పృహలోకి వచ్చింది కానీ పూర్తి స్పృహలోకి రాలేదు. అమ్మాయి ఆరోగ్యంగానే ఉంది, వయసులోనే ఉంది, ఏం కాదు కొంచెంసేపు ఆగితే మత్తు వదిలి లేస్తుందని మీకర్ అనే నర్స్ బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. అలా 5 గంటల 30నిముషాలు వరకు ఎమ్మాలిన్ ను ఆసుపత్రి బెడ్ పైనే ఉంచారు. అప్పటికీ ఆమె పరిస్థితి విషమంగానే ఉంది. ఆమె వింతగా చూస్తూ, నాలిక బయటకి పెడుతూ... చాలా దీన స్థితిలో ఉంది.


భయపడిపోయిన ఆసుపత్రి వారు.. 911కి ఫోన్ చేసారు. అప్పుడు 911 డాక్టర్లు వచ్చి... బాలిక పరిస్థితి గురించి తెలుసుకున్నారు. బాలిక బ్రెయిన్ కోలుకోలేని స్థితిలో డామేజ్ అయ్యిందని, 50 సంవత్సరాల పాటు ఆమెకు ఒక ట్యూబ్/పైప్ ద్వారా ఆహారాన్ని అందించాలని చెప్పారు. ఆపై, 22 రోజుల పాటు ఒక ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందిన ఎమ్మాలిన్, ప్రస్తుతం రోగులను యాధస్థితికి తీసుకొచ్చే ఒక సంరక్షణ కేంద్రంలో ఉంటుంది. ఇకపోతే, పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్ జాఫరీ, నర్స్ మీకర్ వలనే ఎమ్మాలిన్ జీవితం నాశనం అయ్యిందని ఆమె తల్లిదండ్రులు వారిపై ఫిర్యాదు చేసారు. వారిపై కేసు నమోదు అయ్యింది. గత 5నెలల నుంచి ఎమ్మాలిన్ తల్లిదండ్రులు తమ బిడ్డ వద్దకు వచ్చి కంటపడి పెట్టుకుంటూ ఆమెకు నయం కావాలని కోరుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: