తల్లి ప్రేమ కంటే విలువైనది ప్రపంచంలో ఏదీ లేదంటారు. నిజమే మరి.. తల్లీ తన బిడ్డలను కాపాడుకోవడం కోసం ప్రాణాలనైనా అర్పిస్తుందని...తాజాగా ఓ తల్లి పక్షి నిరూపించి అందరి హృదయాలను దోచేసుకుంటుంది. 

 

 

వివరాల్లోకి వెళితే.. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ 'పర్వీన్ కస్వాన్' తన ట్విట్టర్ ఖాతాలో ఒక తల్లి పక్షి తన బిడ్డలను కాపాడుకునే వీడియోని పోస్ట్ చేశాడు. ఆ పోస్టులో.. 'తల్లి ప్రేమ అంటే ఇదే మరి. ఒక తల్లి పక్షి తన గుడ్లు ఉన్న ప్రాంతం నుంచి కదలకూడదని నిశ్చయించుకుంది. ఆమె తన గుడ్లు ఉన్న చోట ధైర్యంగా నిలబడింది. పక్షి కోసం రైతు తన విహనాన్ని/యంత్రాన్ని చాలా జాగ్రత్తగా నడపాల్సి వచ్చింది.' అని పేర్కొన్నారు. 

 

వీడియోని శ్రద్ధగా పరిశీలిస్తే.. పొలం పనులు కోసం వినియోగించే ఒక భారీ ట్రాక్టర్ పక్షి గుడ్లు పెట్టుకున్న వైపు వస్తుంది. అయితే, ఇది గమనించిన తల్లి పక్షి.. తన గుడ్డులోని పిల్లలకు హాని జరగబోతుందని... తన రెక్కలను విడిచి గుడ్లని రక్షిస్తూ వాహనానికి ఎదురుగా నిలబడింది. ఆ ట్రాక్టర్ భయంకరమైన ఇంజిన్ మోతతో తన మీదకి వస్తున్న కొంచం కూడా కదలకుండా తన గుడ్లను కాపాడుతుంది. ఇది చూసిన నెటిజన్లు.. తల్లి ప్రేమకు.. ఇంకా అది చూపించిన ధైర్య సాహసానికి ఫిదా అయిపోతున్నారు. 

 

ఈ వీడియోలో రెండు గొప్ప విషయాలు తెలుస్తున్నాయి.. ఒకటి తల్లి తన గుడ్లను కాపాడుకోవటం, మరొకటి రైతు పక్షికి కొంచెం కూడా హాని జరగకుండా ట్రాక్టర్ నడపటం. కొంతమంది మాత్రం ఇలాంటి ఎక్స్పరిమెంట్ చేసి తల్లిని ఎంతో భయబ్రాంతులకు గురి చేసి, దాన్ని బాధపెట్టారని రైతుని తప్పుబడుతున్నారు. వీడియోలో పక్షి పై చేసిన ఎక్స్పరిమెంట్ క్రూరంగా ఉందని మరికొంత మంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఏదైమైనా ఈ ఓల్డ్ వీడియో మళ్లీ తెరపైకి వచ్చి ఇంటర్నెట్లో సంచలనం రేపుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: