ముసి ముసి నవ్వులు వొలికే చిన్నారులను చూస్తే ఎవరికన్నా ఆనందంగా ఉంటుంది..పిల్లలు తెలిసి తెలియని చేష్టలు, వచ్చి రాని మాటలు, ఆటలు, నవ్వులు అన్ని మనకి సంతోషాన్ని ఇస్తాయి.. తల్లితండ్రులు ఎన్ని కష్టాలు పడ్డా పిల్లల బోసి నవ్వులు చూస్తే ఆ కష్టాన్ని సైతం మర్చిపోతారు...

 

చిన్నపిల్లలు పెద్ద అయ్యి మాట్లేడే వరకు తల్లి తండ్రులు జాగ్రత్త వహించాలి.. ఎందుకంటే వాళ్ళకి మాటలు రావు... ఏదన్న ఇబ్బంది ఉంటే ఏడుస్తారు తప్ప సమస్య ఇది అని చెప్పలేరు.. అందుకే జాగ్రత్త వహించాలి.. ఫొటోస్ కోసం పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదు... అలంకరణ, డాబు, దర్పం కోసం ఒక్కో సారి మనం చేసే పనులు వల్ల పసిపిల్లలు ఇబ్బంది పడతారు..

 

ఇలాంటి ఒక సంఘటన నిజామాబాద్ పట్టణంలో జరిగింది. పిల్లలను అందంగా ముద్దుగా తయారుచేసి ఫొటోలు తీసుకోవాలని తల్లిదండ్రులు ముచ్చటపడిపోతుంటారు. తమ వద్ద ఉన్న నగలతో చిన్నారులను అలంకరించి.. సరదా పడుతుంటారు. అయితే, ఇలా పిల్లలను నగలతో అలకరించడం, చిన్నారి శిశువులకు ఉంగరాలు తొడిగే విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న ప్రాణం మీదకి వస్తుంది... 

 

వివరాలలోకి వెళితే ఒక తల్లితండ్రులు వాళ్ళ ఐదు నెలల బాబు కి ఉంగరం తొడిగారు... ఆ బాబు వేలు నోట్లో పెట్టుకుని ఆడుకుంటూ పొరపాటున నోట్లోకి వెళ్లిపోయింది.. గొంతులో చిక్కుకునిపోయింది. దానితో బాబు శ్వాస పీల్చుకోడం కష్టం అయ్యి ఉక్కిరి బిక్కిరి అయ్యి ఏడవడం మొదలుపెట్టాడట.. బాబు ఏడుపు గమనించిన తల్లి తండ్రులు హుటాహుటిన వైద్యశాల కి తీసుకుని వెళ్లారట.

 

వైద్యులు ఎక్స్‌రే పరీక్షలు నిర్వహించి.. ఉంగరం గొంతులో ఉన్నట్టు గుర్తించారు. చికిత్స ద్వారా గొంతు నుంచి వైద్యులు ఉంగరాన్ని తొలగించారు. ప్రస్తుతం ఐదు నెలల చిన్నారి యాసిన్ క్షేమంగా ఉన్నాడు. తమ కొడుకు క్షేమంగా బయటపడటంతో తల్లిదండ్రులూ ఊపిరిపీల్చుకున్నారు.... పిల్లల విషయంలో ప్రతి తల్లి తండ్రి జాగ్రత్త వహించాలి.. కంటికి రెప్పలా కాపాడుకోవాలి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: