ఈ రోజుల్లో మందుల వాడకం రోజురోజుకు పెరిగిపోతుంది ... మారుతున్న జీవన శైలితో చిన్న వయసు నుంచి కీళ్లనొప్పుల బారిన పడుతున్నారు చిన్నారులు. ఇక  పెద్దల పరిస్థితి అయితే చెప్పాల్సిన పనిలేదు. లేచి రెండడుగులు వేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో రోజు ఆహారాన్ని తీసుకున్నట్లు గానే మందులు తీసుకుంటూ జీవితాన్ని ముందుకు నెట్టుకొస్తున్నారు నేటి తరం ప్రజలు. చాలా మంది ఒకరోజు మందులు లేకుండా బతకడం కష్టమే అన్న పరిస్థితుల్లో కూడా ఉన్నారు. అంతేకాకుండా ఏ చిన్న నొప్పి వచ్చినా ఏ చిన్న నలతగా అనిపించినా  టాబ్లెట్లు పైనే ఆధారపడుతున్నారు నేటితరం  జనాలు . ఎక్కువగా మందులు వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి  మరిన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని అందరికీ తెలిసినప్పటికీ టాబ్లెట్ల వాడకం  మాత్రం రోజురోజుకూ పెరిగిపోతోంది. 

 

 

 

 చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ అందరూ మందుల పైనే జీవనం సాగిస్తున్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా సరే... ఆ సమస్యకు ఇంజక్షన్లు టాబ్లెట్లు అంటూ  మందుల పై ఆధార పడుతూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఇప్పటి కాలంలో చిన్న పిల్లల్లో కూడా ఊరికే కీళ్ల నొప్పులు రావడం... లేకపోతే బాడీపెయిన్స్ రావడం జరుగుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు వేస్తూ ఉంటారు. పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేయడం ద్వారా సత్వర ఉపశమనం లభిస్తుందని భావిస్తూ ఉంటారు. అయితే చీటికిమాటికి పిల్లలకు పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు వాడితే హాని జరిగే ప్రమాదం ఉందని అంటున్నారు పరిశోధకులు. 

 

 

 

 పెయిన్ కిల్లర్లు అధిక మోతాదులో తీసుకుంటే అవి విషపూరితంగా మారుతాయని అమెరికాలోని యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. కొంత మంది చిన్నారులపై తాము చేసిన అధ్యయనంలో ఈ విషయం  వెల్లడైనట్లు వారు తెలిపారు. పెయిన్ కిల్లర్ టాబ్లెట్ లలో ఉండే ఓపియాడ్  మహమ్మారి చిన్నారుల్లో  తీవ్ర దుష్ప్రభావం చూపుతుందని అధ్యయనంలో తేలిందని పరిశోధకులు తెలిపారు. అదే పనిగా పెయిన్ కిల్లర్లు వాడి ఆసుపత్రి లో చేరుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందని  పరిశోధకులు పేర్కొన్నారు. అందుకే చిన్న పిల్లలకు పేద పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్  వేయడం మానుకోవాలని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు పరిశోధకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: