క్రిస్మస్.. క్రైస్తవుల ఆరాధ్యుడైన యేసు క్రీస్తు పుట్టినరోజుగా పరిగణించబడుతోన్న రోజు.  ప్రపంచవ్యాప్తంగా ఈ వేడుకను డిసెంబర్ 25న ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. క్రిస్మస్ పండగ వచ్చిందంటే చాలు అందరికి ముందుగా గుర్తుకు వచ్చేది గిఫ్ట్‌లు..  ఆ తర్వాత నోరూరించే విందు భోజనాలు. విద్యుత్ వెలుగులతో జిగేల్ మనిపించే ఈ వేడుకల్లో ఆహారం  కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అయితే ఈ క్రిస్మస్ కు ప్రత్యేకంగా కేకులు తయారు చేస్తారు. మ‌రి ఈ క్రిస్మ‌స్‌కు ఆపిల్ కేక్ ఎలా త‌యారు చేయాలో తెలుసుకుందాం..

 

కావాల్సిసిన ప‌దార్థాలు: బటర్‌- 125 గ్రా, బ్రౌన్‌ షుగర్‌- అరకప్పు, వెనీలా- ఒక టీ స్పూను, గుడ్లు - రెండు, మైదా- ఒక క‌ప్పు, బేకింగ్ పౌడ‌ర్‌- ఒకటిన్నర స్పూన్‌, ఉప్పు- అర‌టీ స్పూన్‌, పాలు - ముప్పావు కప్పు, ఆపిల్స్ - రెండు, ఆప్రికాట్‌ జామ్‌ - పావుకప్పు, డబుల్‌ క్రీమ్ - అలంక‌ర‌ణ‌కు.

 

తయారీ విధానం: ముందుగా అవెన్‌ను 180 సెం. డిగ్రీల వద్ద ప్రీ-హీట్‌ చేసి ఉంచాలి. త‌ర్వాత పాన్‌లో బటర్‌తో గ్రీస్‌ చేయాలి. ఇప్పుడు ఒక బౌల్‌లో బటర్‌, పంచదార, వెనీలా వేసి బాగా నురగ వచ్చేవరకు గిలకొట్టాలి. ఇప్పుడు గుడ్లు వేసి మరోసారి గిలకొట్టాలి. తర్వాత మైదా, బేకింగ్ పౌడ‌ర్, చిటికెడు ఉప్పు మ‌రియు పాలు కూడా వేసి కలపాలి. ఈ మిశ్ర‌మాన్ని పాన్‌ టిన్‌లో పోసి పైన పలచగా కట్‌ చేసుకున్న ఆపిల్‌ ముక్కల్ని చుట్టూ పేర్చాలి. ఆ త‌ర్వాత 40 నిమిషాలపాటు బేక్‌ చేసుకుని తీసెయాలి. చల్లారిన తర్వాత ఆప్రికాట్‌ జామ్‌, క్రీమ్‌లతో డెక‌రేట్ చేసి ఫ్రీజ‌ర్‌లో పెట్టుకుని గంట‌ త‌ర్వాత బ‌య‌ట‌కు తీస్తే స‌రిపోతుంది. అంతే క్రిస్మ‌స్ స్పెష‌ల్ ఆపిల్ కేక్ రెడీ..!

 

మరింత సమాచారం తెలుసుకోండి: