న్యూ ఇయర్ వచ్చిందంటే చాలు యువత హంగామా చిన్నగా ఉండదు. అర్ధరాత్రి రోడ్ల మీద‌ కేక్‌‌లు కట్ చేయడం, ఫ్రెండ్స్‌తో హ్యాపీగా ఎంజాయ్ చేయడం, బైక్‌‌‌లతో రోడ్ల పై హల్‌చల్ చేయడం ఇలా పలు రకాలుగా వాళ్లు పిచ్చాపాటిగా వేడుకలు జరుపుకుంటారు. కుల, మ‌త బేధాలేమీ లేకుండా జ‌రుపుకునే పండ‌గే న్యూయ‌ర్‌.  ఈ క్రమంలో న్యూయ‌ర్‌ రోజు జరిగే ప్రమాదాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. ఏటా దీన్ని తగ్గించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు 2020 వేడుకల్లో… రోడ్డు ప్రమాదాలు, దుర్ఘటనలు, అపశృతులుకు ఆస్కారం లేకుండా, ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు పలు నిబంధనలు, మార్గదర్శకాలను రూపొందించారు. పోలీసులు జారీ చేసిన నిబంధనలను ఈవెంట్స్‌ నిర్వాహకులు, హోటల్స్‌, పబ్‌ యాజమాన్యాలు, ఇతరులు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. అటు, మహిళలకు పటిష్ట భద్రత. 

 

ఇక ఇదిలా ఉంటే కొంత మంది మ‌హిళలు న్యూయ‌ర్ రోజున ఎక్కువ‌గా షాపింగ్‌లు చేస్తూ కాలాన్ని వెల్ల‌దీస్తారు. కొంద‌రు ఫ్యామిలీ మెంబ‌ర్స్‌తో ఎంజాయ్ చేస్తే ఇంకొంద‌రు ఫ్రెండ్స్‌తో క‌లిసి పార్టీలు, ప‌బ్‌లు అంటూ ఎంజాయ్ చేస్తుంటారు.  నగరంలోని పలు హోటళ్లు, పబ్‌లు, క్లబ్‌లు, రిసార్ట్స్‌లు 31వ తేదీ రాత్రి నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. శివార్లలోని పలు రిసార్ట్స్‌లు, నగరంలోని పలు ఐదు నక్షత్రాల హోటళ్లు ఆకర్షనీయమైన ప్యాకేజీలతో యువతను ఆకట్టుకునేందుకు ఇప్పటికే ఆఫర్లను ప్రకటించాయ. పలు చోట్ల ఉచితంగా డీజే పార్టీలు ఏర్పాటవుతున్నాయ. 

 

మరికొన్ని చోట్ల 31 రాత్రి నూతన సంవత్సరం వేడుకను పురస్కరించుకుని డిస్కౌంట్‌లు ఇస్తుండగా, మరికొన్ని బహుళ జాతి కంపెనీలు, ఐటీ కార్పొరేట్ సంస్థలు తమ ఉద్యోగుల కోసం ప్రత్యేక వేదికలను ఏర్పాటు చేయటంలో నిమగ్నమై ఉన్నాయి. జంటల వారీగా, ఒంటరిగా, చిన్నారులకు వేర్వేరుగా ఛార్జీలను నిర్ణయించారు. మ్యూజిక్, కాక్‌టైల్, నాన్ కాక్‌టైల్, డీజే మ్యూజిక్ క్యాటగిరీల కింద ఇప్పటికే పలు రిసార్ట్స్‌లు, ఐదు నక్షత్రాల హోటళ్లు టిక్కెట్లు విక్రయిస్తున్నాయి. కానీ, ఒకవైపు చలి, మరోవైపు పోలీసుల ఆంక్షలు ఉండటంతో కార్పొరేట్ వ్యక్తులు, సెలబ్రిటీలు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, విద్యార్థి విద్యార్థినులు, కపుల్స్, కుటుంబ సభ్యులు ఓ మోస్తారు కార్పొరేట్ సౌకర్యాలతో కూడిన వేదికలను ఎంచుకుని, రాత్రంతా అక్కడే గడిపేందుకు ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్నారు. మామూలు రోజుల మాదిరిగా కాకుండా 31 నైట్ వేడుకలకు సంబంధించి కపుల్స్‌కు పలు హోటళ్లు, రిసార్ట్స్‌లు నైట్ స్టేకు ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తెస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: