ప్రపంచం అంతా క్రిస్మస్ వేడుకలను చర్చిల్లో ప్రార్ధనల మధ్య సంతోషంగా జరుపుకుంటున్నారు. కానీ ఇండోనేషియా లోని ఆషే ప్రాంత ప్రజలు మాత్రం క్రిస్మస్ వేడుకలను నట్టడవిలో జరుపుకుంటున్నారు. వీరి చర్చి ని కొందరు ఇస్లామిక్ విజిలెంట్ గ్రూపులు మరియు పోలీసులు కూల్చేశారు. దాదాపు నాలుగు సంవత్సరాల క్రితం చర్చిని కూలగొట్టారు అప్పటి నుంచి ఈ ప్రాంత ప్రజలు అడవిలోనే ఒక టెంట్ వేసుకుని ఆ టెంట్ కింద క్రిస్మస్ వేడుకలని జరుపుకుంటున్నారు. 

 

ఆషే ప్రాంత ప్రజలు తాము చివరిసారిగా 2015వ సంవత్సరంలో చర్చిలో క్రిస్మస్ వేడుకలను జరుపుకున్నామని ఈ ప్రాంత వాసి బ్యూరెట్ చెప్పారు. ఆ తరువాత 1960వ సంవత్సరంలో నిర్మించిన ఈ చర్చికి ఎలాంటి అనుమతులు లేవంటూ కొంతమంది నిరసనకారులు మూకుమ్మడిగా చర్చిపై పెట్రో బాంబు తో దాడి చెయ్యడంతో చర్చి పూర్తిగా ధ్వసం అయింది. భారీ ఎత్తున వచ్చిన నిరసనకారులను పోలీసులు నిలువరించలేకపోయారు. కళ్ళముందే చర్చిని నేలమట్టం చేశారు. అప్పటి నుంచి చర్చి నిర్మాణం కోసం మేము ప్రభుత్వం చుట్టూ తిరుగుతూనే ఉన్నాం, కానీ ప్రభుత్వం మాత్రం చర్చి నిర్మాణానికి అనుమతి నిరాకరిస్తూ వస్తోంది అని బ్యూరెట్ చెప్పారు. 

 

ప్రపంచంలోని అతిపెద్ద ముస్లిం జనాభా కలిగిన ఇండోనేషియా బహు రాజ్యాంగాన్ని కలిగి ఉంది, ఇది అన్ని ప్రధాన విశ్వాసాలు కలిగివున్న ప్రజల హక్కులను పరిరక్షించడానికి ఉద్దేశించబడింది. కానీ సింగ్కిల్ ఆషేలోని నాయకులు స్థానిక అధికారులు చర్చి పునర్నిర్మాణం చేయకుండా ఆపుతున్నారని ఆ ప్రాంత వాసులు ఆరోపిస్తున్నారు. ఈ ప్రాంతంలో చర్చి నిర్మాణం జరగాలంటే కనీసం 100 మంది క్రిస్టియనేతరులు చర్చి నిర్మాణానికి అనుకూలంగా సంతకం పెట్టాలి అలా అయితేనే ఈ ప్రాంతంలో చర్చి నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. ఈ ప్రాంత మేయర్ ముసరిద్ "కొంతమంది క్రిస్టియన్స్ నా దగ్గరకి వచ్చి చర్చి నిర్మాణనికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరారు కానీ ప్రభుత్వ నిబంధనలు పక్కన పెట్టి సొంతంగా నేను నిర్ణయం తీసుకోలేను కదా" అని ఆయన చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: