ప్రస్తుత కాలంలో చాలా మంది మగాళ్లలో శృంగార సామర్థ్యం తగ్గిపోతోంది. బెడ్‌రూమ్‌లో భాగస్వామిని సంతృప్తి పరచలేక ఇబ్బంది పడుతున్నారు. దానికి శారీరక బలహీనతతో పాటు మానసిక ఒత్తిళ్లు, ఆహార అలవాట్లు వంటి ఎన్నో రకాల కారణాలున్నాయి.మన అలవాట్లే మనల్ని సామర్థ్యం కోల్పోయేలా చేస్తాయి.
ఆహారం వ్యక్తి ఆరోగ్యాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది.

 

అనారోగ్యకరమైన ఆహారం శృంగార జీవితంలో ఇబ్బందులు తెస్తుంది.ఎక్కువ శాతంలో బేకరీ ఐటమ్స్, ఫాస్ట్ ఫుడ్ వంటి జంక్ ఫుడ్ తీసుకోవటం వల్ల సెక్స్ సామర్ధ్యం తగ్గిపోతుంది.బయట ఫుడ్ లో ఎటువంటి పోషక పదార్దాలు ఉండవు. ఎదో టేస్ట్ కోసం ఏదిపడితే అది తినటం వల్ల శరీరానికి కావలిసిన శక్తి రాదు.
అంతేకాదు ఎక్కువగా మందులు వాడేవారు సంభోగం సమయంలో త్వరగా నీరసించిపోతారని నిపుణులు చెబుతున్నారు.

 


అతిగా మద్యం తాగడం, ప్రొగ తాగడం వల్ల కూడా సెక్స్ సామర్ధ్యం త్వరగా తగ్గిపోతుందని పలు అధ్యయనాల్లో తేలిందిఎక్కువగా మందు, సిగరెట్లు తాగితే అవి పురుషునిలోని వీర్య కణాల్ని నాశనం చేస్తాయి.ఆరోగ్యకరమైన శృంగార జీవితం కోసం జంక్ ఫుడ్‌, చెడు వ్యసనాలకు వీలైనంత దూరంగా ఉండాలి.

 

వ్యాయామం చేయటం వల్ల పురుషుల్లో రక్త ప్రసరణ బాగా జరిగి చక్కటి శక్తి సామర్ధ్యాలు పొందుతారు.ఎక్కువ మంది పురుషులు తమ భాగస్వాముల పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుంటారు. ఇది మంచిది కాదు.లైఫ్ పార్ట్‌నర్‌ని నిర్లక్ష్యం చేస్తే దాని ప్రభావం కుటుంబ జీవితంతో పాటు శృంగారం జీవితంపైనా ప్రభావం చూపుతుంది.

 

భార్యతో గొడవ పడితే సాధారణంగానే ఆందోళన, ఒత్తిడి పెరిగి శీఘ్రస్కలన సమస్యను ఎదుర్కోవలసి ఉంటుంది.అందుకే ఆందోళన, ఒత్తిడి, కంగారు తగ్గించి క్రమశిక్షణతో కూడిన అలవాట్లను అనుసరిస్తే భార్యను సంతృప్తి పరచగలరు...మీ పడకగదిలో మీ శక్తి సామర్ధ్యం కూడా పెరిగిద్ది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: