ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, వాయు కాలుష్యంతో పాటు మనం తీసుకునే ఆహార పదార్దాల్లో పెద్దగా క్వాలిటీ కూడా లేకపోవడం, మనల్ని పలు రకాల వ్యాధులకు గురి చేస్తోంది. ఇక ఇటీవల కొద్దికాలంగా మనలో కొంత మందిని పట్టి పీడిస్తున్న సమస్య ఆకలి మందగించడం. ఏదో మొక్కుబడిగా టైంకి తినాలి కాబట్టి ఎంతో కొంత తినేసి లేచిపోతూ ఉంటారు. అయితే ఆ విధంగా అయిష్టతతో తినే ఆ ఆహారం సరిగ్గా మన ఒంటికి పట్టకపోవడం, అలానే అది కనుక మన కడుపుకు సరిపోకపోతే ఒకింత చికాకుగా, కడుపులో కూడా వెలితిగా ఉంటూ పలు రకాల ఇబ్బందులకు దారి తీస్తుంది. అయితే అటువంటి పరిస్థితులకు చెక్ పెడుతూ, 

 

కొద్దిపాటి చిన్న టెక్నీక్స్ పాటిస్తే, డైలీ హ్యాపీగా కడుపునిండా భోజనం చేయవచ్చని అంటున్నారు డాక్టర్లు. అయితే, ఆహారం భుజించే కొద్ది సమయం ముందు ఎటువంటి చిరుతిళ్ళు, కూల్ డ్రింక్స్ వంటివి తీసుకోకూడదట. అవి ఆకలిని మరింత తగ్గిచివేయడంతో పాటు భోజనంపై ఆసక్తిని తగ్గిస్తాయట. అలానే భోజనం చేసే సమయంలో ప్రక్కన సెల్ ఫోన్, టివి చూడడం వంటివి ఏమి లేకుండా చూసుకోవాలట, అలానే తినే పదార్ధం మీద దృష్టిపెట్టడం వలన ఆస్వాదిస్తూ తినవచ్చట. ఇక భోజనానికి ముందు ఏవైనా మంచి ఫుడ్ ఐటమ్స్ కి సంబందించిన ప్రోగ్రామ్స్ ని వీక్షించడం వలన, అవి మన నోరూరించడంతో పాటు మనసుకి ఆకలిని ప్రేరేపిస్తాయట. 

 

అలానే అవకాశం ఉన్నంతవరకు ఒంటరిగా కాకుండా మన తోటివారితో కూడా కలిసి భోజనం చేయగలిగితే, వారితో పాటు మనకు కూడా కొంత ఎక్కువగా తినాలి అనే ఆలోచన వస్తుందట. ఇక వీటితో పాటు ముఖ్యంగా ఆకలి వేయడానికి ప్రత్యేకంగా మందులు వాడడానికి బదులుగా రోజూ మొదటి ముద్దలో శొంఠి పొడిని కలుపుకుని తినడం, లేదా డైలీ శొంఠి కాఫీ వంటివి తాగడం వంటిది అలవాటు చేసుకుంటే, అది కడుపులో గ్యాస్ వంటివి పారద్రోలి ఆకలిని ప్రేరేపిస్తుందట. అలానే ఆకలి బాగా వేసిన సమయంలో ఒక్కసారే అధిక మోతాదులో తినకుండా, కొద్ధి కొద్దిగా తక్కువ మోతాదులో ఎక్కువసార్లు కనుక తీసుకుంటే, అది మన శరీరానికి బాగా పడుతుందని అంటున్నారు. అయితే ఈ నియమాలు అవకాశం ఉన్నంతవరకు క్రమం తప్పకుండా పాటిస్తే, మెల్లగా ఆకలి మందగించినవారికి భోజనం పై ఆసక్తి కలుగుతుందని అంటున్నారు......!! 

మరింత సమాచారం తెలుసుకోండి: