మారిటల్ డేటింగ్ యాప్ 'గ్లీడెన్' వివాహేతర సంబంధాల గురించి ఒక స్టడీ చేసి ఆసక్తికరమైన  డేటాను సేకరించింది. ఆ స్టడీ ప్రకారం భారతీయ మహిళలు వివాహేతర సంబంధాల కోసం 30-40 సంవత్సరాల మధ్య వయస్సు గల పురుషులను భాగస్వాములుగా ఇష్టపడతారు. మగవారు మాత్రం ఎక్కువగా 25-30 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళా భాగస్వాములను ఇష్టపడతారు. మగవారు అక్రమ సంబంధం పెట్టుకోవడం కోసం ఏ మహిళ పరిచయం అయినా.. వెంటనే ఇష్టపడతారు. ఇంకా, ఎక్కువగా ఎక్సయిటింగ్ ఉండే రిలేషన్ కోసం చూస్తారు.

 

 

శుక్రవారం వెల్లడించిన డేటా ప్రకారం, భారతీయ మహిళలు వివాహేతర సంబంధాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటారు. వారు ఎక్కువగా ‘వర్చువల్’ సెక్స్  ఎక్స్ఛేంజీలను ఇష్టపడతారు. ప్రధానంగా, భారతీయ యాప్ వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌ల నుండి కనెక్ట్ అవ్వడానికి ఇష్టపడతారు. వారు వెబ్‌సైట్‌కు వ్యతిరేకంగా ఉంటూ మొబైల్ యాప్ లలో వివాహేతర సంబంధాన్ని వెతకడానికి ఎక్కువ మొగ్గు చూపుతారు. 

 

 

చాటింగులు కోసం సగటున 1.5 గంటలు సమయం గడుపుతారని, ఇంకా 3 సార్లు యాప్ లో శృంగార పార్టనర్ కోసం వెతుకుతారని స్టడీ చెబుతుంది. డేటింగ్ యాప్ ని ఎక్కువగా మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య చూస్తారని స్టడీ వెల్లడించింది. భోజన విరామ సమయంలో, రాత్రి 10, అర్ధరాత్రి మధ్య, ఇంకా జీవిత భాగస్వామి నిద్రలో ఉన్నప్పుడు వివాహేతర సంబంధాల కోసం వెతుకుతారని Gleeden డేటింగ్ యాప్ స్టడీ లో తేలింది.

 

 

ఢిల్లీ మహిళలు ఆన్‌లైన్‌లో ఎక్కువ సమయం గడుపుతూ... రోజూ రెండు గంటలకు పైగా చాటింగులు చేస్తారట. వారు 30 మరియు 40 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు. ఢిల్లీ ఆడవారు ఎక్కువగా వైద్యులు, దంతవైద్యులు, ఉన్నత స్థాయి నిర్వాహకులు, చార్టర్డ్ అకౌంటెంట్లు వంటి అత్యధిక ఆదాయం ఉన్న పురుషులను కోరుకుంటారు. గ్లీడెన్‌లో, మొత్తంమీద, 12 శాతం వివాహం అయిన వారు ఒకే లింగానికి చెందిన వ్యక్తితో వివాహేతర సంబంధం కోసం చూస్తున్నారు. ఇందులో 12 శాతం మంది మహిళలు (మొత్తం సమాజంలో 18 శాతం, ఆరు శాతం మంది మగవారు.)

మరింత సమాచారం తెలుసుకోండి: