క్షణం తీరిక లేని జీవనం.. నిత్యం పరుగులు, సమయానికి నిద్రాహారాలు లేకపోవడం.. నిలకడలేని ఆలోచనలతో యంత్రాల్లా పరిగెట్టడం.. తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన పరిస్థితుల్లో అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ఎదిగేకొద్దీ ఎన్నో బాధ్యతలు. ఉద్యోగాలు, పనులు, టైమ్‌ ఉండని పరిస్థితి. ఇలాంటి రోజుల్లో కూడా కొంత మంది టైమ్‌ కేటాయించి వాకింగ్‌ చేస్తుంటారు. అయితే వాకింగ్ కంటే.. జాగింగ్ ఇంకా ఎక్కువ ప్రయోజనాలు కలిగిస్తుందంటున్నారు డాక్టర్లు. సో.. ఏ మాత్రం టైమ్‌ లేని వాళ్లు రోజూ కనీసం 5 నిమిషాలైనా పరిగెడితే ఎంతో మేలు జరుగుతుందంటున్నారు. 

 

రన్నింగ్ ఒక ఉపశమనం కలిగించే వ్యాయామం. ఇది ఆరోగ్య సౌలభ్యం మరియు తక్కువ ఒత్తిడి స్థాయిలకు సహాయపడుతుంది. రన్నింగ్ రక్త ప్రసరణ పెంచడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు రక్తపోటు నిర్వహణ మరియు వివిధ హృదయ సంబంధిత రోగాలు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఉదయాన్నే నిద్ర మత్తు ఉంటుంది. అలాంటి సమయంలో జాగింగ్‌కి వెళ్తే.. ఆ పచ్చటి ప్రకృతి, సూర్య కిరణాలు, పక్షుల అరుపులు, చక్కటి వాతావరణం అన్నీ కలగలిసి ఎంతో ఆహ్లాదం కలుగుతుంది.

 

అది తలనొప్పిని తగ్గిస్తుంది. బాడీకి, బ్రెయిన్‌కీ ఎక్కువ ఆక్సిజన్ అందుతుంది. డిప్రెషన్ తగ్గుతుంది. రన్నింగ్ జీర్ణక్రియ మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఇది ఆకలి పెరగటానికి సహాయం చేస్తుంది. అయితే రన్నింగ్ చేసే వారు ఎట్టి పరిస్థితిలోనూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్ మానేయరాదు. అలా చేస్తే ఎనర్జీ లెవల్స్ తగ్గుతాయి. కనుక వారు ఉదయాన్నే మంచి ప్రోటీన్లు ఉన్న ఆహారం తీసుకుంటే మంచిది. ఇక కొన్ని అధ్యయనాల ప్రకారం క్రమం తప్పకుండా రన్నింగ్ చేస్తే రకం-2 మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గించటానికి సహాయపడుతుంది.

 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: