ముగ్గురు కాలేజీ విద్యార్థినిలు తమ స్నేహితురాలైన పుట్టినరోజు వేడుకలను ఆ అమ్మాయి ఇంట్లో తమ తల్లిదండ్రుల పర్మిషన్ లేకుండా జరుపుకుంటున్నారు. బర్త్ డే పాప తప్ప మిగతా ముగ్గురు తమ కాలేజీ యూనిఫామ్ ధరించారు. ఆ సెలెబ్రేషన్స్ లో పుట్టినరోజు జరుపుకుంటున్న అమ్మాయి సోదరుడు కూడా ఉన్నాడు. అమ్మాయిలు బీర్లు తాగుతుంటే, అబ్బాయి మాత్రం ఏకంగా విస్కీ సీసానే లేపాడు. అయితే, యూనిఫామ్ ధరించి మద్యం సేవించినందుకు వారి కాలేజీ యాజమాన్యం వారికి ఝలక్ ఇచ్చింది.

 


వివరాల్లోకి పోతే, తమిళనాడు లోని నాగపట్నం జిల్లాలో ముగ్గురు విద్యార్థినులు తమ స్నేహితురాలి పుట్టినరోజు వేడుకలలో పూటుగా మద్యం సేవించి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారు. ఏదో బాగా అలవాటు ఉన్నవారివలే మద్యం సేవిస్తూ స్నాక్స్ తింటూ బాగా హల్ చల్ చేసారు. ఇది చాలదన్నట్లు వారి చేష్టలను వీడియో తీసి దాన్ని సామజిక మాధ్యమాలలో అప్లోడ్ చేసారు. అయితే ఆ వీడియో చూసిన కళాశాల ప్రిన్సిపాల్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేసారు. 


'ఆడపిల్లలై ఉండి మన కాలేజీ యూనిఫామ్ వేసుకొని.. మద్యం తాగుతూ వీడియో తీసుకుంటారా. మళ్ళీ మీరేదో పెద్ద ఘనకార్యం చేసినట్లు ఆ వీడియోని సోషల్ మీడియా లో పెడతారా. సిగ్గు, శరం లేదా మీకు. కాలేజీ కు మీరు అసలు రావొద్దు. ఇంటి దగ్గర కూర్చొని చావండి. మీలో మంచి ప్రవర్తన కలిగే వరకు మేము కళాశాలలో కాలు పెట్టనివ్వం.' అని ఆ కాలేజీ ప్రిన్సిపాల్ వారిపై మండిపడ్డారు.



దాంతో వారిలోని ఓ అమ్మాయి ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు సమాచారం. కాలేజ్ నుంచి వారి బహిష్కరణ జనవరి 2, 2020 నుండి అమల్లోకి వస్తుంది. నివేదికలో పేర్కొన్న విధంగా ప్రిన్సిపాల్..    కళాశాలకు దాని స్వంత నియమాలు, నిబంధనలు ఉన్నాయని, అవి విద్యార్థులలో విలువలను పెంపొందించి, జీవితంలో పైకి రావడానికి సాయపడుతాయని చెప్పారు.


కళాశాల ప్రాంగణం లోపల వారు మద్యం సేవించలేదు కానీ ఆ బాలికలు వారి కళాశాల యూనిఫాం ధరించి, ఇన్స్టిట్యూట్ యొక్క ఖ్యాతిని నాశనం చేసారని ప్రిన్సిపాల్ అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: