మామూలుగానే హైదరాబాద్‌లో పార్టీలంటే ఓ రేంజ్‌లో జోష్‌ ఉంటుంది. ఇక న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ అంటే ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాలా? షరా మామూలుగానే న్యూ ఇయర్‌ వేడుకలకు.. మరింత కొత్తగా ముస్తాబైపోయింది భాగ్యనగరం. నయాసాల్‌ ముబారక్‌ చెప్పుకొనేందుకు... సై అంటోంది. 

 

2019కి బైబై చెప్పేసి... ట్వంటీ ట్వంటీకి వెల్‌కమ్‌ చెప్పేందుకు ఇంకా కొన్ని గంటలే మిగిలింది. ఈ కొత్త సంవత్సరం వేడుకలని గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకునేందుకు సిద్ధమైపోయింది. ఈ ఏడాది సిటీలో సెలబ్రెటీల సందడి.. గ్రాండ్‌ ఈవెంట్స్‌ లేకపోయినా.. ఎవరికి వాళ్లు థర్టీఫస్ట్‌ నైట్‌ పార్టీలకు సిద్దమైపోతున్నారు. కోటి ఆశలతో కొత్త సంవత్సరానికి డిఫరెంట్‌గా వెల్‌కం చెప్పేందుకు గెట్‌ రెడీ అంటున్నారు.

 

కనిపించీ కనిపించని లైటింగ్ లు.. వేల వాట్లతో చెవులు చిల్లులుపడిపోయే సౌండ్‌ సిస్టమ్స్‌..  విందులు.. అందులో చిందులు.. మొత్తంగా న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌కు రెడీ అవుతోంది పల్స్‌ సిటీ. లైవ్‌ మ్యూజిక్ షోలలో, డీజేల హోరులో మైమరిచిపోయి ఆడిపాడేందుకు యంగస్టర్స్‌ సై అంటున్నారు. ఫ్యామిలీస్‌, ఫ్రెండ్స్‌ తో కలిసి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ప్లాన్‌ చేసుకుంటున్నారు.

 
హైదరాబాద్ నగరంలో ఈ సారి న్యూఇయర్‌ వేడుకల్లో సెలబ్రిటీల సందడి, గ్రాండ్‌ ఈవెంట్సేమ్‌ లేవు. కానీ ఉన్నంతలో గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకోవడానికి ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు పార్టీ లవర్స్‌. వీరి ఆసక్తికి తగినట్టే యూత్‌ని, ఫ్యామిలీస్‌ని, చిన్నారులను అట్రాక్‌ చేసే ఆఫర్లతో కొన్ని ఈవెంట్స్‌ సీటీలో ఏర్పాటవుతున్నాయి.

 

యువతరం సంగతి వేరే చెప్పక్కర్లేదు. ఎవరి ప్లాన్స్‌లో వాళ్లు బిజీ అయిపోయారు. న్యూఇయర్‌ కు గ్రాండ్‌గా వెల్‌కమ్‌ చెప్పేందుకు.. గ్రూప్‌గా ఏర్పడి ట్రెండీగా కొత్త సంవత్సరం వేడుకల్ని సెలబ్రేట్‌ చేసుకునేందుకు రెఢీ అవుతున్నారు. మొత్తానికి న్యూ ఇయర్ వేడుకలకు భాగ్యనగరం సిద్ధమైపోయింది. కొన్ని గంటల్లో కొత్త సంవత్సరానికి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: