కొత్త సంవత్సరం వేడుకలనగానే.. నగరంలో కనిపించే సందడి అంతా ఇంతా కాదు. చిన్నా పెద్దా అనే తేడాలేకుండా.. అంతా కలిసి గ్రాండ్‌గా ఈ వేడుకల్ని సెలబ్రేట్‌ చేసుకుంటారు. అందుకే అన్ని వర్గాలనూ ఆకట్టుకునేలా పబ్ లు, హోటల్స్‌, బార్ లు, రెస్టారెంట్లు.. సరికొత్త ఆఫర్స్‌తో సిద్ధంగా ఉన్నాయి.

 

ఇప్పుడు న్యూ ఇయర్‌ వేడుకల ట్రెండ్‌ మారిపోయింది. ఎంటర్‌టైన్‌మెంట్‌లో వయోభేదాలు కనిపించడం లేదు. అందుకే అందరినీ ఈ సెలబ్రేషన్స్ వైపు తిప్పుకొనేలా...  ఎప్పటికప్పుడు కొత్త మార్పులతో ముందుకొస్తున్నారు ఈవెంట్‌ ఆర్గనైజర్స్‌. ట్రెండ్‌ సెట్‌ చేయాలనే ఆలోచనతో ముందుకొస్తూ.. అట్రాక్ట్‌ చేస్తున్నారు.

 

కొత్త సంవత్సరం వేడుకలతో పబ్‌లు, హోటళ్లు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లకు కొత్త కళ వచ్చేసింది. నగరంలో ఈ సారి పెద్దగా సెలబ్రిటీ షోస్‌ ప్లాన్‌ చేయకపోవడంతో... పార్టీ లవర్స్‌ను తమవైపు ఆకర్షించేలా కొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. మరోవైపు  వినూత్న ఆఫర్లతో వైన్‌ షాపుల యజమానులు అమ్మకాలను మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. 


 
ఇక కొత్త ఏడాది సెలబ్రేషన్స్‌ అంటేనే బాలీవుడ్‌, హాలీవుడ్‌ పాటలతో.. మోత మోగిపోవాల్సిందే. అందుకే ఈసారి కూడా దేశీయ, అంతర్జాతీయంగా ఫేమస్ అయిన  డీజేలతో స్పెషల్‌ షోలను ఏర్పాటుచేస్తున్నారు. ఇలాంటి ఈవెంట్స్‌లో ఇప్పుడు లేడీ డీజేలదే హవా. ఎలక్ట్రానిక్స్‌ డ్యాన్స్‌ మ్యూజిక్‌, రెట్రోలకు భలే క్రేజ్‌ ఉంటుంది. రీమిక్స్ లతో  ప్లే చేసే తెలుగు పాటలకు చిందేయడంలో కుర్రకారు పొందే ఆనందం మాటల్లో చెప్పలేం. 

 

ఏటేటా ఈ పార్టీలకు హాజరవుతున్న వారి సంఖ్య పెరగడంతో పాటు.. చిన్నపాటి గొడవలూ జరుగుతున్నాయి. అందుకే అలాంటి ఇబ్బందేం లేకుండా.. ప్రీమియం పార్టీలు ఏర్పాటు చేస్తున్నారు నిర్వహకులు. అయితే సాధారణ టిక్కెట్‌తో పోలిస్తే రెండుమూడింతలు ఎక్కువ వసూలు చేస్తున్నారు. ఇలాంటి పార్టీల్లో ఒక్కో పెయిర్‌కు 20 వేల చొప్పున వసూలు చేస్తున్నారు. టేబుళ్లకు రకరకాల పేర్లు పెట్టి.. గ్రూపులుగా వచ్చేవారి నుంచి లక్షల్లో కూడా వసూలు చేస్తున్నారు.

 

ఇక బార్‌లు కూడా భారీగానే ప్లాన్‌ చేస్తున్నాయి. తమ దగ్గరికొచ్చే మందుబాబులు... అక్కడే న్యూ ఇయర్‌ వేడుకలు జరుపుకునేలా ఏర్పాట్లు చేశాయి కొన్ని బార్లు. రెగ్యులర్‌ కస్టమర్లకు.. థర్టీఫస్ట్‌ నైట్‌ ఫ్యామిలీస్‌తో వచ్చేలా... బార్లను ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. 

 

ధరలు ఎంత పెరిగినా థర్టీఫస్ట్‌ నైట్‌ మాత్రం కాంప్రమైజ్‌ అయ్యేదే లేదంటున్నారు మద్యం ప్రియులు. ఫ్రెండ్స్‌తో కలిసి ఆ ఒక్కరోజైనా కాస్ట్‌లీ బ్రాండ్‌ సిప్‌ చేసేందుకు రెడీ అవుతుండగా.. అందుకు తగ్గట్టే  వైన్స్‌ షాపులు కూడా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఫారిన్‌ బ్రాండ్‌ బీర్లు 5 కొంటే ఒకటి ఫ్రీ ... కాస్ట్‌లీ స్కాచ్‌, విస్కీ బాటిల్స్‌పై 10 శాతం డిస్కౌంట్‌ అంటూ ఆఫర్లతో ఆకట్టుకునే పనిలో ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: