2019 వ సంవత్సరంలో ఎన్నో అర్థంకాని ఫొటోస్ నెట్టింట హల్చల్ చేసాయి. కొన్ని ఫొటోలలోని నిజాన్ని మీరు వెంటనే గమనించినా, మరికొన్ని ఫోటొస్లోని అంతరార్థం ఇప్పటికీ అర్థంకాకుండా మిగిలిపోయాయి. అయితే ఇప్పుడు మళ్ళీ మరొక విచిత్ర  చిత్రం నెట్టింట దర్శనమిచ్చి అందర్నీ విస్తుపోయాలా చేస్తుంది. అదేంటంటే, బ్రా వేసుకొని ఉన్న గుర్రె ఫోటో. అసలు ఆ గుర్రెకు బ్రా ఎందుకు వేసారో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.


ఓ బ్రిటిష్ దంపతులు ఈ గుర్రెను ఇంగ్లాండ్ లోని బెర్నార్డ్స్ ఫారంలో పెంచుతున్నారు. అయితే, కొన్ని వారాల క్రితం ఈ గుర్రె రెండు పిల్లలకు జన్మనిచ్చింది. ఇంతకీ ఆ గుర్రె పేరేంటంటే.. బార్బరా. బార్బరా తన రెండు గుర్రె పిల్లలకు జన్మనిచ్చిన అనంతరం దాని యజమానులు ఓ పాత DD-cup బ్రాను దానికి తొడిగారు.


ఎందుకు ఆ గుర్రెకు బ్రా వేశారని గుర్రెను పెంచే డేవిడ్ క్రాస్ ను, ఇంకా తన వైఫ్ క్యాథరీన్ ని ప్రశ్నించినప్పుడు, వాళ్లు ఇలా సమాధానమిచ్చారు.. 'బార్బరా తల్లి అయిన తరువాత దాని పొదుగులోకి పాలు చేరి ఆ పొదుగు చాలా కిందకు వేలాడేది. తన పొదుగు నేలను కూడా తాకేది. అప్పుడు బార్బరా పిల్లలు పాలు తాగేందుకు చాలా ఇబ్బందిపడేవి. ఈ సమస్యను పరిష్కరించాలని మేము ఓ రోజు ఆలోచించాము. అప్పుడే బార్బరాకి ఒక మంచి బ్రా తొడిగితే, తన పొదుగు నేలను తాకదని, తన పిల్లలు కూడా ఏ ఇబ్బంది లేకుండా పాలు తాగగలవని తెలుసుకున్నాము. అందుకే దానికి ఒక బ్రా తొడిగాము,' అని చెప్పుకొచ్చారు.


ఇంతకీ ఆ బ్రా ఎక్కడిదంటే... ఇంటిపక్కన నివసించే ఒక అతను తన కుటుంబ సభ్యుల ఇన్నర్ వేర్లని పారేస్తుండగా.. క్యాథరీన్ అతన్ని ఆపి కొన్ని నిమిషాలపాటు పరిశీలించి.. ఒక 44dd బ్రాను తీసుకుంది. ఆ తరువాత ఆ బ్రాకు కొన్ని రంధ్రాలు చేసి, ఇంకా కొని చిన్నచిన్న మార్పులు చేసి.. దానిని బార్బరాకు తొడిగింది. గుర్రె పిల్లలు మొదట బ్రాని చూసి కన్ఫ్యూజ్ అయినప్పటికీ.. క్యాథరీన్ వాటికి గైడెన్స్ ఇచ్చి పాలు తాగేలా చేసింది.


అయితే, వీళ్ళనే స్ఫూర్తిగా తీసుకున్న న్యూజిలాండ్ పశువైద్యులు 'రోస్' అని పిలవబడే మరొక గుర్రెకి మనిషి బ్రాను తొడిగారు. రోస్ కు మూడు గుర్రె పిల్లలు పుట్టినప్పుడు.. దాని పొదుగు కూడా బాగా కిందకి జారిపోవడంతో బ్రాను తొడిగామని న్యూజిలాండ్ వైద్యులు చెబుతున్నారు. మంచి కారణంతోనే గుర్రెలకు బ్రా వేసినప్పటికీ.. ఇది ఫన్నీగా ఉందని అదే పనిగా నవ్వుకుంటారు నెటిజన్లు.





మరింత సమాచారం తెలుసుకోండి: