కొత్త సంవత్సరం అంటే అదో వేడుక. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కి కౌంట్‌డౌన్ ఇప్ప‌టికే స్టాట్ అయింది. కేవ‌లం మ‌రికొన్ని గంటల్లోనే  కోటి ఆశలతో కొత్త సంవ‌త్స‌రంలోకి అడుగుపెట్ట‌బోతున్నాం. కొత్త అంటే డైరీలు, క్యాలెండర్ల పేజీలు, మారడం మాత్రమే కాదు. కొత్త సంవత్సరం అంటే కొత్తగా ఆలోచించడం.. కొత్త ప్రణాళికలు వేసుకోవడం.. కొత్త పనులు ప్రారంభించడం.. ఇలాంటివెన్నో ఉంటాయి. ఇక న్యూ ఇయ‌ర్ వ‌స్తుందంటే.. చిన్న పిల్ల‌ల ద‌గ్గ‌ర నుంచి పెద్ద‌ల వ‌ర‌కు ఏదో తెలియ‌న ఆనందం. ఎందుకంటే గతించిన కాలం కంటే భవిష్యత్ మనకు బంగారు బాటలు వేస్తుందన్న నమ్మకం.  ఆ విశ్వాసంతోనే మనం కొత్త సంవత్సరానికి ఆనందంగా స్వాగతం పలుకుతాం. 

 

అయితే ఇంతేసి గ్రాండ్‌గా అందరూ న్యూఇయర్‌కు వెల్‌కమ్ చెబుతారనుకోవడానికి లేదు. ఒక్కో దేశంలో ఒక్కో రకంగా ఉంటుంది. ఎవరి సెంటిమెంట్‌లు వారివి మరి. ఆ సంగతులేంటో చూద్దాం.  ఒక్కో దేశపు ప్రజలు ఒక్కో తీరుగా జరుపుకుంటారు. ఎవరి ఆచారాలు వారివి. ఎవరి సంప్రదాయాలు వారివి. కొన్ని ఫన్నీగా ఉంటాయి. కొన్ని వింతగొలుపుతాయి. కొన్నేమో ఆశ్చర్యాన్ని కలుగజేస్తాయి. ఆ మాటకు వస్తే కొన్ని దేశాలు అయితే జనవరి ఒకటిని న్యూఇయర్‌గానే గుర్తించవు. ఇక ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే.. డెన్మార్క్ ప్రజలు మాత్రం న్యూ ఇయర్ రోజు తమ పాత వంట సామాగ్రిని స్నేహితుల ఇంటి ముందు ఉన్న నేలకువేసి పగల కొడతారు. 

 

వాస్త‌వానికి ఒకరి ఇంటికి వ్యతిరేకంగా వస్తువులను పగులగొట్టడం దురదృష్టంగా పరిగణిస్తారు. కాని దీనికి వ్య‌తిరేఖంగా.. ఉపయోగించని పాత్రల్ని పగలగొట్టి కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతారు డెన్మార్క్‌ వాసులు. ఆ ఏడాదిలో పాతబడిపోయిన పాత్రలు, ప్లేట్స్‌.. వంటివి పడేయకుండా పక్కన పెట్టి వాటిని డిసెంబర్‌ 31న తమ బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితుల ఇంటి తలుపులకేసి కొడతారు. అయితే ఎవరి ఇంటి ముందు ఎక్కువ ప్లేట్లు పగిలిపోతాయో వారు ఆ సంవత్సరం ఎక్కువ సంతోషంగా ఉంటారని భావిస్తారు డెన్మార్క్ ప్రజలు. మ‌రియు  ఇలా చేయడాన్ని కొత్త సంవత్సరానికి శుభసూచకంగా భావిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: