ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఒక్కో సంప్రదాయం ఉంటుంది. అది.. పండుగలకు కావొచ్చు.. ఆనందాలు, సంతోషాలకు కావొచ్చు, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు కావొచ్చు. ఒక్కోచోట ఒక్కో సంప్రదాయం ప్రకారం ప్రజలు ఆనందంగా గడుపుతూ ఉంటారు. ఏ దేశంలో అయినా నూతన సంవత్సర వేడుకలు భారీగానే జరుగుతూంటాయి. అక్కడి నిర్వాహకులు కూడా భారీ ఏర్పాట్లు చేస్తూంటారు. స్పెయిన్ లో కూడా అలాంటి సంప్రదాయమే కొనసాగుతోంది.

 

 

స్పెయిన్ సంప్రదాయం ప్రకారం ఆ దేశస్థులు 12 ద్రాక్ష పళ్ళు తినడం ఆనవాయితీ అట. అర్ధరాత్రి ప్రతి సెకన్ కి ఒకటి చొప్పున పోటీ పడుతూ తింటారట. ధ్వని వేగం కంటే ఎక్కువ. అసాధ్యమే అయినా.. ఇందుకు ప్రజలు ప్రాక్టీస్ కూడా చేస్తారు. ఇందులో విజయవంతమైతే ఆ ఏడాది అంతా సంతోషంగా ఉంటారని అక్కడి సంప్రదాయంగా చెప్తారు. దీనిని ఓ ప్రత్యేక ప్రదేశం నోచెవిజా.. లేదా మాడ్రిడ్‌లోని ప్యూర్టా డెల్ సోల్‌లో నిర్వహిస్తారు. నూతన సంవత్సర వేడుక కోసమే ప్రత్యేకంగా అక్కడ ఏర్పాట్లు చేస్తారు. ఒక చేతిలో 12 ద్రాక్ష, మరో చేతిలో ఒక గ్లాసుతో అక్కడ జనసమూహంలో చేరతారు. ఇది ఒక పెద్ద పార్టీగా జరుగుతుంది. ఇక మామూలుగానే అక్కడి క్లబ్‌లలో తెల్లవారుజాము వరకు నృత్యం చేస్తారు. స్పెయిన్ లో ఇలాంటి సంప్రదయాలు చాలానే ఉంటాయి. టమోటా ఫస్టివల్ అక్కడ ఎంతో ఫేమసో తెలిసిందే.

 

 

పాశ్చాత్య దేశాల్లో సంస్కృతులు భిన్నంగా ఉంటాయి. అందుకు తగ్గట్టే అక్కడి వారి వ్యవహార శైలి ఉంటుంది. అందులో భాగంగానే వారి సెలబ్రేషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. వెస్ట్రన్ కల్చర్ లో భాగమే ఇదంతా. అయితే.. వారి ఆచార వ్యవహారాలను, అలవాట్లను తక్కువ చేసి చూడలేము. ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న ఆచారాలను వీరు పాటిస్తూ కొనసాగిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: