జనవరిలో బ్యాంక్‌ జాబ్ చేస్తున్న వాళ్లకు సెలవుల పండగే.. పండగ. అకౌంట్ ఉన్నవాళ్ళంతా సెలవులతో జాగ్రత్తగా వ్యవహరించండి. పాత ఏడాది ముగిసింది. నేటితో కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్నాం. అందుకే కొత్త ఏడాది తొలి నెల జనవరిలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయో ఇప్పుడే తెలుసుకోవడం మంచిది. బ్యాంకులకు జనవరి నెలలో 16 రోజులు సెలవులు ఉన్నాయి. పబ్లిక్ హాలిడేస్ అన్ని కలుపుకొని ఈ సెలవులు ఇచ్చాం. దీంతో సెలవులకు అనుగుణంగా బ్యాంకింగ్ పనులు చక్కదిద్దుకోవచ్చు.
 

రిజర్వు బ్యాంక్ రాష్ట్రాల ప్రాతిపదికన బ్యాంక్ సెలవులను ప్రకటించింది. ఇక్కడ బ్యాంక్ సెలవులు రాష్ట్రాల ప్రాతిపదికన, బ్యాంక్ ప్రాదిపదికన మారుతూ ఉంటాయి. ఒక రాష్ట్రంలో బ్యాంకుల సెలవు ఉంటే.. మరో రాష్ట్రంలో ఆ రోజున బ్యాంకులకు సెలవు ఉండకపోవచ్చు. ఇకపోతే బ్యాంకులు ఆదివారాలు ఉండవు. అలాగే రెండు, నాలుగో శనివారాల్లోనూ పనిచేయవు. మొత్తంగా జనవరి నెలలో ఎక్కువ బ్యాంకులకు దాదాపు 10 రోజులకు పైగా సెలవు రోజులు ఉన్నాయి.


దేశవ్యాప్తంగా జనవరి నెలలో బ్యాంక్ సెలవులు ఇవే..
జనవరి 1 - కొత్త సంవత్సరం (చాలా ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు), జనవరి 2 - గురుగోవింద్ సింగ్ జయంతి చాలా రాష్ట్రాల్లో హాలిడే ఉంది. జనవరి 5 - ఆదివారం, జనవరి 7 - ఇమోయిను ఇరత్పా (ఇంఫాల్),  జనవరి 8 - గాన్‌ఘాయి (ఇంపాల్‌లో సెలవు), జనవరి 11 - రెండో శనివారం, జనవరి 12 - ఆదివారం, జనవరి 14 - మకర సంక్రాంతి అహ్మదాబాద్‌లో సెలవు. జనవరి 15 - ఉత్తరాయణ మకర సంక్రాంతి, పొంగల్.. చెన్నై, గౌహతి, హైదరాబాద్, అమరావతి తదితర ప్రాంతాల్లో సెలవు.


జనవరి 16 - తిరువల్లూర్ డే (చెన్నై), జనవరి 17 - ఉజావర్ తిరునాల్ సెలబ్రేషన్స్ (చెన్నై), జనవరి 19 - ఆదివారం,  జనవరి 23 - నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి (కోల్‌కతా, అగర్తాల) జనవరి 25 - నాలుగో శనివారం, జనవరి 26 - ఆదివారం, జనవరి 30 - సరస్వతి పూజ, వసంత పంచమి.

మరింత సమాచారం తెలుసుకోండి: