కొత్త సంవత్సరం వచ్చేసింది. ఈ శుభవేళ కొత్త లక్ష్యాలు నిర్దేశించుకుంటారు చాలా మంది.. కొత్త బాసలు చేసుకుంటారు. కొత్త టార్గెట్లు పెట్టుకుంటారు. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. అయితే అంతా ఆరంభ శూరత్వం కాకూడదు. అలాగే మన లక్ష్యాలు కేవలం మన కోసమే కాకూడదు. వ్యక్తి లక్ష్యంగా ఈ టార్గెట్లు ఉండకూడదు.

 

డబ్బు సంపాదన అవసరమే.. కానీ అదే పరమావధి కాకూడదు. నిన్ను మెచ్చుకునే వారిని సంపాదించుకోవాలన్న ఆశ కూడా తప్పుకాదు.. కానీ అదే నీ లక్ష్యం కాకూడదు. ఆస్తులు కూడా బెట్టుకోవడం కూడా తప్పు కాదు.. కానీ అదే నీ అంతిమ లక్ష్యం కాకూడదు. మరి ఏంటి ఏది ఉత్తమమైన లక్ష్యం.

 

ఉత్తమమైన ఆలోచనే ఉత్తమమైన లక్ష్యం. మంచిగా ఆలోచిద్దాం.. మంచినే కాంక్షిద్దాం. మనతో పాటు మరో నలుగురిని ఆనందగా బతకనిద్దాం. అలాగే కొండంత లక్ష్యం కన్నా పిడికెడు ఆచరణ గొప్పదు. పెట్టుకున్న లక్ష్యాలను అందుకునేందు చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాలి. ఎన్ని అడ్డంకులు వచ్చినా పోరాటం ఆపకూడదు. అలాగే లక్ష్యం ఎంత ఉన్నతమో.. దాన్ని సాధించే మార్గం కూడా అంతే ఉన్నతంగా ఉండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: