పాత సంవత్సంరానికి విడ్కోలు చెప్పి.. కోటి ఆశ‌ల‌తో కొత్త సంవ‌త్స‌రానికి స్వాగ‌తం ప‌లికాం.  కొత్త ఏడాది మంచి చేస్తుందని మన జీవితాలు సుఖమయం అవుతాయని ఆశ. ఆ చిగురంతా ఆశతోనే జగమంతా వేడుక చేసుకుంటుంది. ఇక న్యూ ఇయ‌ర్ అంటే..  పబ్‌లు, క్లబ్‌లు, పార్టీలు, ఫంక్షన్లు.. ఇలా అందరం ఆనందంలో మునిగితేలుతుంటాం. గతించిన కాలం కంటే భవిష్యత్ మనకు బంగారు బాటలు వేస్తుందన్న నమ్మకం.  ఆ విశ్వాసంతోనే మనం కొత్త సంవత్సరానికి ఆనందంగా స్వాగతం పలుకుతాం. కొత్త అంటే డైరీలు, క్యాలెండర్ల పేజీలు, మారడం మాత్రమే కాదు. కొత్త సంవత్సరం అంటే కొత్తగా ఆలోచించడం, కొత్త ప్రణాళికలు వేసుకోవడం, కొత్త పనులు ప్రారంభించడం.. ఇలాంటివెన్నో ఉంటాయి. 

 

కొత్త సంవత్సరం మార్పునకు మెట్టు లాంటిది. అలాంటి మెట్లను మనం ఎన్ని ఎక్కుతున్నాం? ఎలా ఎక్కుతున్నాం? కొత్త ఆనందాన్ని దేంట్లో వెతుక్కుంటున్నాం? చెక్‌చేసుకొని ఈ కొత్త సంవత్సరం నుంచి జీవితపు కొత్త అధ్యాయాన్ని ప్రారంభిద్దాం. ఆశే జీవితం, ధైర్యమే నడిపే ఇంధనం.. ఆశ‌లు ఎన్ని ఉన్నా.. ధైర్యంతో, న‌మ్మ‌కంతో ముందుకు క‌దులుతుంటే విజ‌యం మ‌న‌వెంటే ఉంటుంది. ఇక మీరు ఏదైనా అనుకుంటే అది సాధ్యం కావాలి అనుకోగానే సరిపోదు, దానికి ఒక ప్లానింగ్ ఏర్పాటు చేసుకుని ముందుకు సాగ‌డం చాలా మంచిది.

 

వాస్త‌వానికి ప్రతీరోజు కొత్త రోజే. అక్కడి నుంచి నువ్వు కదలకపోతే దాంట్లో ఉండే ఆనందాన్ని పొందలేవు అన్నమాట. అందుకే కొత్త సంవత్సరం సందర్భంగా కొత్త పనులకు శ్రీకారం చుట్టండి. వీటివల్ల గతంలో చేసిన తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్త తీసుకోవచ్చు. మార్పును కోరుకుంటే వెలుగును కోరుకున్నట్టే. మ‌రో ముఖ్య విష‌యం ఏంటంటే..  జీవితంలోని ప్రతీ సందర్భాన్ని.. సన్నివేశాన్ని ఆస్వాదిస్తూ చేయాలి. అలా ప్రతి పనినీ ఇష్టపడి చేస్తేనే జీవితం సంపూర్ణంగా అనుభవించవచ్చు. ప్రతీ పనిని ఇష్టపడి చేయండి. అలా చేయడం వల్లనే ఆ పనిలోని మాధుర్యం తెలుస్తుంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: