2019 సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ కొత్త సంవత్సరానికి వెల్ కం చెబుతూ చిన్నా పెద్దా అంతా కలిసి దేశవ్యాప్తంగా నూతన సంవత్సరానికి ఘన స్వాగతం పలికాం. ఈ నూతన సంవత్సరంలోని 366 రోజులు ఆనందంగా గడపటంలో మంచి కుటుంబాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. కుటుంబ వ్యవస్థ మానవ సామాజిక జీవనానికి పునాది. మన దేశ కుటుంబాలు సామాజిక విలువలు, క్రమశిక్షణ కలిగిన సంప్రదాయం గల వంటివని ప్రపంచంలోనే పేరు పొందాయి. 
 
కుటుంబంలో పిల్లలు, పెద్దల మధ్య మంచి సంబంధాలు కలిగి ఉంటే పిల్లలు ఎదగటానికి కుటుంబంలో మంచి వాతావరణం ఏర్పడుతుంది. అలాంటి కుటుంబాలలో వ్యక్తుల మధ్య ప్రేమానురాగాలు, అనుబంధాలు అలవడతాయి. కుటుంబ వాతావరణం వ్యక్తి మంచి లక్షణాలతో పరిపూర్ణ వ్యక్తిగా ఎదగడంలో దోహదపడుతుంది. కుటుంబంలో ప్రేమానురాగాలతో పెరిగే పిల్లలు ఎదిగి సమాజంలో మంచి పేరును పొందుతారు. 
 
సమాజంలో కూడా ప్రేమానుబంధాలతో ఉన్న కుటుంబాలు సమాజంలో మంచి స్థానాన్ని పొందుతాయి. ఇటువంటి కుటుంబాలతో మంచి సమాజం ఏర్పడుతుంది. మంచి సమాజానికి మంచి కుటుంబమే పునాది. పెద్దవారి నుండి నేర్చుకునే పద్ధతులు పిల్లలు మంచి వ్యక్తులుగా ఎదగటంలో సహకరిస్తాయి. తల్లిదండ్రులు తాము మంచిని ఆచరిస్తూ పిల్లలకు మార్గదర్శకం చేయటం ద్వారా పిల్లలు తల్లిదండ్రుల మాటల పట్ల గౌరవం కోల్పోకుండా ఉంటారు. ఇలాంటి కుటుంబాలు మంచి కుటుంబాలుగా మంచి సమాజానికి పునాది వేసి సమాజ అభివృద్ధికి దోహదపడతాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: