మనసు, మమత, బంధం, అనుబంధం, రక్తసంబంధం. ఇలా ఎన్ని కబుర్లు చెప్పుకున్నా.. ఈ కాలంలో మనుషుల్ని నడిపించేవి మాత్రం ఆర్థిక సంబంధాలే. మన దగ్గర నాలుగు డబ్బులు ఉంటేనే ఎవరైనా మనల్ని ఖాతరు చేసేది. అందుకే మనిషికి ఆర్థిక క్రమశిక్షణ చాలా ముఖ్యం.

 

మరి డబ్బు ఎలా పొదుపు చేయాలి.. ఇందుకు ప్రత్యేకంగా ఏమీ చేయనక్కర్లేదు ఓ సింపుల్ సూత్రం ఉంది. అదే.. 20 శాతం పొదుపు.. 80 శాతం ఖర్చు. ఈ సూత్రాన్ని పాటిస్తే ఏ ఆర్థిక కష్టాలూ మిమ్మల్ని భయపెట్టలేవు. వచ్చిన ఆదాయంలో 80 శాతంతోనే కుటుంబ అవసరాల కోసం వాడుకోవాలి. తప్పనిసరిగా 20 శాతం సొమ్ముని భవిష్యత్తు కోసం దాచి పెట్టాలి.

 

ఇందుకు ఎలాంటి పరిస్థితుల్లోనూ మినహాయింపు ఇవ్వకూడదు. మరి పండగలు, పబ్బాలు, శుభకార్యాలు, విహారయాత్రలు వస్తే ఏంచేయాలి. అలాంటివి ఉన్నప్పుడు ముందుగానే ప్లానింగ్ చేసుకుని దానికి కొంత కాలం ముందు నుంచి వాటి కోసం డబ్బుపక్కకు పెట్టుకోవాలి. ఈ సూత్రాన్ని క్రమం తప్పకుండా అనుసరించి చూడండి. ఎంత ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుందో.?

మరింత సమాచారం తెలుసుకోండి: