పాత సంవ‌త్స‌రానికి గుడ్ బై చెప్పి.. కొత్త సంవ‌త్స‌రంలోకి అడుగు పెట్టేసాం.  కొత్త ఏడాది మంచి చేస్తుందని మన జీవితాలు సుఖమయం అవుతాయని ఆశ. ఆ చిగురంతా ఆశతోనే జగమంతా వేడుక చేసుకుంటుంది. ఈ నూతన సంవత్సరంలోని 366 రోజులు ఆనందంగా గ‌డ‌పాల‌ని అంద‌రూ కోరుకుంటారు.  అయితే అంద‌రికీ ఒకేసారి న్యూ ఇయ‌ర్ రాదు. ఒక్కో చోట ఒక్కో టైమ్‌లో న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్ చేసుకుంటారు. ఇక‌ ప్రపంచంలో అన్ని దేశాల కంటే ముందుగా 2020లోకి అడుగుపెట్టిన ఐలాండ్ దేశాల్లో ఒసినీయా తొలి ఐలాండ్ దేశంగా అవతరించింది.

 

చిన్న పసిఫిక్ ఐలాండ్ దేశాల్లో టొంగా, సమోవా, కిరిబాటి ఫస్ట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకున్నాయి. ఆ తర్వాత న్యూజిలాండ్ 2020లోకి అడుగుపెట్టిన రెండో దేశంగా నిలవగా, ఆస్ట్రేలియా, జపాన్, సౌత్ కొరియా కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టేశాయి. ఇక చివరిగా సెంట్రల్ పసిఫిక్ ఒసియన్‌లో ఉన్న బేకర్స్ ద్వీపంలో చివరిగా న్యూ ఇయర్ వేడుకలు జరుగనున్నాయి. భారత కాలమానం ప్రకారం.. డిసెంబర్ 31, మధ్యాహ్నం 3.30 గంటలకు ఐలాండ్ దేశాల్లో సమోవా, టొంగాతో పాటు క్రిస్మస్ ఐలాండ్/కిరిబాటిలో ముందుగా న్యూ ఇయర్ బెల్స్ మోగాయి.

 

ఆ త‌ర్వాత మధ్యాహ్నం 3:45 గంటలకు చాతమ్ ఐలాండ్‌లో న్యూ ఇయర్ వస్తుంది. సాయంత్రం 4:30 గంటలకు న్యూజిలాండ్‌ 2020లోకి అడుగుపెడ‌తారు. సాయంత్రం 5:30 గంటలకు రష్యా సంబంధిత భూభాగాల్లో న్యూ ఇయర్ వస్తుంది.  సాయంత్రం 6:30 గంటలకు ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్, సిడ్నీ, కెన్ బెర్రా, హానియారాలో న్యూ ఇయర్ వస్తుంది. రాత్రి 7 గంటలకు అడిలైడ్, బ్రోకెన్ హిల్, సెడునాలో కొత్త ఏడాది వస్తుంది. రాత్రి 7:30 గంటలకు బ్రెస్బేన్, పోర్ట్ మోర్సెబే, హగత్నాలో న్యూ ఇయర్ ప్రారంభం. రాత్రి 8 గంటలకు డార్విన్, అలైస్ స్ర్పింగ్స్, టెన్నంట్ క్రీక్ లకు న్యూ ఇయర్ వస్తుంది. 

 

అలాగే రాత్రి 8:30 గంటలకు జపాన్, టోక్యో, సౌత్ కొరియా, సీయోల్, ప్యాంగ్యాంగ్, దిలి, ఎన్గెరుల్ముడ్ న్యూ ఇయ‌ర్ వ‌స్తుంది. రాత్రి 12:00 గంటలకు భారత్, శ్రీలంక దేశాల్లో 2020 కొత్త ఏడాది వస్తుంది. రాత్రి 12:30 (జనవరి 1) గంటలకు పాకిస్థాన్ 2020లోకి అడుగుపెడుతుంది. అదే విధంగా భారత కాలమానం ప్రకారం.. జనవరి 1 ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటలకు కెనడాలో ముందుగా కొత్త సంవత్సరం వస్తుంది.. ఆ తర్వాత USAలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మొదలవుతాయి. ఆ తర్వాత చిట్టచివరిగా బయటి ద్వీపమైన బేకర్ ఐలాండ్‌లో 2020 కొత్త ఏడాది ప్రారంభం అవుతుంది. ఇలా ఒక్కో దేశంగా ఒక్కో టైమ్‌లో న్యూ ఇయ‌ర్ వేడుక‌లు స్టాట్ అవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: