నిన్నటితో 2019వ సంవత్సరం ముగిసి నేటి నుండి సరికొత్త ఏడాది 2020 లోకి యావత్ ప్రపంచం అడుగుపెట్టింది. గత ఏడాది జరిగిన చెడుని వదిలేసి, ఈ ఏడాది తొలిరోజు నుండి అందరూ కూడా అన్నింటా విజయాలు అందుకోవాలని ప్రధాని మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇక ఈ ఏడాది కూడా మన దేశవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు మిన్నంటాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా జరిగే ఈ వేడుకలను అందరికంటే ముందుగా గెట్ వే ఆఫ్ న్యూ ఇయర్ లో జరుగుతాయి. పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో గల కిరిబాటి ఐలాండ్ లో జరిగే ఈ వేడుకలు క్రిస్మస్ కంటే ముందే మొదలవుతాయి. దాదాపుగా నెలరోజుల పాటు జరిగే ఈ వేడుకలకు దేశ విదేశాల నుండి లక్షలాదిగా పర్యాటకులు రావడం జరుగుతుంది. వాస్తవానికి ఈ ద్వీప జనాభా కొన్ని లక్షలు మాత్రమే అయినప్పటికీ, 

 

ఇక్కడికి వచ్చే పర్యాటకుల శాతం, జనాభా కంటే రెండు రేట్లు ఎక్కువ ఉంటుందంటే, ఇక్కడికి వచ్చే పర్యాటకులు ఎంతమంది ఉంటారో మనం అర్ధం చేసుకోవచ్చు. నీలి రంగు సముద్రం మధ్య, అక్కడక్కడ నాచుతో నిండిన చిన్నచిన్న భూభాగాలు, వాటి చుట్టూ ఇసుక మేటలతో కూడిన సముద్ర తీరాలు ఉండడంతో, ఈ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించేందుకు  పర్యాటకులు ఎంతోమంది ఇక్కడికి వస్తుంటారు. న్యూజిలాండ్‌, సిడ్నీ, న్యూయార్క్‌ కన్నా ముందే ఇక్కడ కొత్త సంవత్సరం ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. 

 

ఇక ప్రతి ఏడాది క్రిస్మస్‌, న్యూఇయర్‌ వేడుకలను పురస్కరించుకుని ఈ దేశ ప్రభుత్వం ప్రత్యేక పర్యాటక ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకుకొస్తుంటుంది. ఇక ప్రపంచంలోని అందరి కంటే ముందుగా నూతన సంవత్సరాన్ని ఆహ్వానం పలికేందుకు పర్యాటకులు అక్కడి కానో రేసింగ్‌, ఫిషింగ్‌, చిన్నచిన్న బోట్‌లపై పరుగు పందాలు, బీచ్‌లలో ఆటల పోటీల్లో ఎంతో ఉత్సాహంగా  చిన్న, పెద్ద అనే తారతమ్యం లేకుండా అందరూ పాల్గొంటారు. ఇక ఇక్కడి ప్రఖ్యాత కిరిబాటి జానపద సంగీతం, నృత్యం ఆకట్టుకోవడంతో పాటు, పక్షి వంటి వస్త్రధారణతో కళాకారులు చేసే నృత్యం చూసేందుకు పర్యాటకులు ఎగబడుతుంటారు.   

 

ఇక ఈ ద్వీపంలో పగలంతా ఎటుచూసినా పర్యాటకులు గుంపులు గుంపులుగా కనిపించడంతో పాటు, రాత్రివేళ కళ్ళు మిరుమిట్లు గొలిపే దీపాలు, బాణసంచా వెలుగులు విరజిమ్ముతాయి. ఆ అత్యద్భుతమైన కాంతుల్లో సముద్రతీరమంతా శోభాయమానంగా మారిపోతుంది. ఇక ఇక్కడ నూతన సంవత్సరం వేడుకలను జరుపుకోవడం జీవితంలో మరిచిపోలేని మైమరిపించే ఆనుభూతిగా ఇక్కడకు వచ్చిన సందర్శకులు భావిస్తారు. అందుకే ప్రతి ఏటా ఇక్కడకు వచ్చే సందర్శకుల తాకిడి పెరుగుతుంది. అయితే వారికి ఏమాత్రం అసౌకర్యం కలుగకుండా అక్కడి ప్రభుత్వం ఎప్పటికప్పుడు సరికొత్త ప్యాకేజీలు, ఏర్పాట్లు ముందుకు తీసుకువస్తాం అని అంటోంది......!!          

మరింత సమాచారం తెలుసుకోండి: