దశాబ్దానికి వీడ్కోలు పలుకుతూ కోటి ఆశలతో మరో దశాబ్దానికి స్వాగతం అంటూ కుల మత, ప్రాంతాలతో సంబంధం లేకుండా చిన్నా పెద్దా అంతా కలిసి ప్రపంచ వ్యాప్తంగా నూతన సంవత్సరానికి ఆహ్వానం పలికారు. ఇక వీడ్కోలు అంటూ 2019కి సెలవు చెప్పి సరిగ్గా 12 గంటలు దాటగానే 2020కి స్వాగతం పలికారు. అప్పటిదాకా విందు వినోదాల్లో మునిగిన వారంతా ఒక్కసారిగా వీధుల్లోకి వచ్చి కేరింతలు కొడుతూ ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో

 

ఇంకొకవైపు బాగా పేరు మోసిన సినీ తారలు మరియు సెలబ్రిటీలు ఆయా ఫంక్షన్లలో తమ హాట్ హాట్ డాన్స్ లతో మరియు పర్ఫామెన్స్ లతో రచ్చ లేపారు. న్యూ ఇయర్ పార్టీ లో బిగ్ బాస్ కంటెస్టెంట్ పునర్నవి తన అందాలతో కుర్రకారుకి పిచ్చేక్కించిన స్టెప్పులేస్తే మరోవైపు గ్లామర్ బ్యూటీ శ్రద్దాదాస్ కూడా అదే స్థాయిలో రెచ్చిపోయింది. కొత్త సంవత్సరానికి ఇంతకన్నా కొత్త ఆరంభం ఉండదు అన్నట్లు గా సాగిన వీరు తమ డాన్స్ స్టెప్పులతో ప్రేక్షకులందరినీ విపరీతంగా అలరించారు.

 

అలాగే రాష్ట్రంలో అన్నీ చోట్లా నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. హైదరాబాద్, విశాఖ, విజయవాడ, తిరుపతి, వరంగల్ తో పాటు ఇతర జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో నూతన సంవత్సర వేడకల్లో ప్రజలు ఉత్సహాంగా పాల్గొన్నారు. పలుచోట్ల ప్రత్యేకంగా పలువురు నూతన సంవత్సరానికి సంబంధించి సాంస్కృతిక కార్యక్రమాలు, డ్యాన్స్ షోలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో కుర్రకారు సంగీతానికి తగిన
స్టెప్పులతో హోరెత్తించారు. బైబై 2019 అంటూ 2020 కు గ్రాండ్ వెల్కమ్ పలికారు.

 

సైబరాబద్ పోలీసులు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. నగరంలోని హైటెక్ సిటీ వద్ద సీపీ సజ్జనార్ దంపతులు కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రాచకొండ సీపీ మహేష్ భగవత్ కేక్ కోసి నూతన సంవత్సర
శుభాకాంక్షలు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: