ఎప్పుడూ ఎవరో ఒకరు మనకు తోడుగా వస్తారని ఆశించకూడదు. ఒక వయస్సుకు వచ్చాక మరొకరిపై ఆధారపడకూడదు. నిత్యం ఒకరిపై ఆధారపడే వారిని తోటివారు కూడా ప్రేమించరు. అశక్తులుగా చూస్తారు. అలాగే మారే కాలంతోపాటు మారాలి. ముఖ్యంగా మహిళలు ఎటువంటి వేధింపులు ఎదురైనా తమనితాము కాపాడుకోగలమనే ఆత్మవిశ్వాసం ఉండాలి.

 

ఇప్పుడు మన ముందున్న మరో ఆయుధం స్మార్ట్ ఫోన్.. కానీ దాన్ని ఎప్పుడూ సినిమాలు, పాటలు, వినోదానికే ఎక్కువగా వినియోగించుకుంటుంటాం. అలా కాకుండా లోకజ్ఞానం తెలుసుకోవడానికి దాన్ని ఉపయోగించాలి. లోకంలో ఎటువంటి నేరాలు జరుగుతున్నాయి. ఎలా అప్రమత్తంగా ఉండాలనేది ఆలోచించాలి.

 

అంతే కాదు.. ఆటలతో ఆర్యోగం, ఆత్మవిశ్వాసం రెండూ అలవడతాయి. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు భయపడి కుంగిపోకుండా.. వాటిని ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తాయి. కుంగ్‌ఫూ, కరాటేలూ నేర్చుకుంటే అవి మనలో ధైర్యాన్ని నింపుతాయి. నేరం జరగకుండా... జరిగినా ఎదుర్కొనే బలాన్నిస్తాయి. ఆపద వస్తే.. పోలీసులను సంప్రదించేలా 100, 112, 108 వంటి హెల్ప్‌లైన్ల మీద అవగాహన పెంచుకోవాలి. షీ టీంల వంటి వాటి పనితీరుపై అవగాహన ఉండాలి. అప్పుడే ధైర్యంగా ఉండగలరు.

మరింత సమాచారం తెలుసుకోండి: