నేటి తరంలో కొత్తగా పెళ్లయ్యే జంటలు విచిత్రమైన స్టంట్ లను ప్రదర్శించి.. ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ షాకుకు గురిచేస్తున్నారు. పోయిన ఏడాది నవంబర్ నెలలో ఒక వ్యక్తి తన పెళ్లి బరాత్ కు ఒక గద్దలాగా ఆకాశంలో ఎగురుకుంటూ పారాచూట్ లో వచ్చి అందర్నీ విస్తుపోయేలా చేశాడు. మరొక సంఘటనలో ఒక పెళ్లి మండపానికి ఒక పెళ్లి కూతురు శవ పేటికలో వచ్చి అందరికీ ఝలక్ ఇచ్చింది. ఆమెదో పెద్ద ఘనకార్యం చేసినట్లు అండర్ టేకర్ మాదిరే శవపేటికలో నుంచి దయ్యం లాగా బయటకు వచ్చి పకపకా నవ్వుతూ భారీ హంగామానే సృష్టించింది.

https://mobile.twitter.com/BiyiThePlug/status/1195664201244651520


ఇటువంటి వీడియోలతోనే విసిగిపోయిన నెటిజన్లకు తాజాగా అలాంటిదే మరొకటి దర్శనమై వారి అసహనానికి కారణమవుతుంది. అదేంటంటే... ఒక నవ వధువు తన పెళ్లి మండపానికి ఒక అంబులెన్సు లో వచ్చింది. అంబులెన్స్ కుయ్.. కుయ్.. కుయ్.. మంటూ పెళ్లి మండపం వద్దకు వస్తుంటే అక్కడికి వచ్చిన దంపతులు అంతా నోరెళ్ళబెట్టి చూశారు. ఆ అంబులెన్స్ లో నుంచి ఒక స్ట్రెచర్ పై ఆమె బయటకు వచ్చింది. పారామెడికల్ దుస్తులను ధరించిన ఆమెను పెళ్లి మండపం లోపలికి ఒక స్ట్రెచర్ పై నెట్టుకుంటూ తీసుకెళ్లాడు ఒక అతను.



ఈ దృశ్యాలను చూసిన నెటిజన్లు
కొంపదీసి ఈ నవ వధువు తొమ్మిది నెలల కడుపుతో ఉందా ఏంటి? అందుకేనా ఎమర్జెన్సీ సేవలను పక్కనే తెచ్చుకుంది అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఏదేమైనా పెళ్లి లాంటి శుభకార్యాలకు అంబులెన్సులను యూస్ చేయటం అంత మంచిది కాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఫేసుబుక్ లో అప్లోడ్ కాబడిన ఈ వీడియోని లక్షల మంది చూశారు. వందల పైచిలుకు లైకులు వచ్చాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: