2019కి గుడ్ బై చెప్పి 2020లో అడుగు పెట్టేసాము. కొత్త సంవత్సరం అనగానే మన జీవితంలో కొత్తగా ఏదైనా శుభం కలగాలని కోరుకుంటాం. కానీ.. ముందుకు వెళ్లడం అన్నది కొత్త ఏడాదితో కాదు, కొత్త ఆలోచనలతోనే సాధ్యమవుతుంది. గడచిన ఏడాది అనుభవాలను ప్రేరణగా తీసుకొని నూతన నిర్ణయాలతో ముందడుగు వేయాలి. ఇక దేశవ్యాప్తంగా న్యూ ఇయర్‌ సంబరాలు అంబరాన్నంటాయి. అయితే టాలీవుడ్ స్టార్ హీరోల్లో కొందరు కుటుంబ సభ్యులతో నూతన సంవత్సరంలో కలిసిన ఇక్కడే జరుపుకోనున్నారు. మరి కొందరూ సినిమా షూటింగ్ ముంగిచుకొని విదేశాలకు వెళ్లి అక్క‌డ ఎంతో ఘ‌నంగా న్యూ ఇయ‌ర్ ఎంజాయ్ చేశారు.

 

ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టికే న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్ కోసం ఇప్ప‌టికే చాలా మంది సెల‌బ్రిటీలు ప‌లు లొకేష‌న్స్‌కి వెళ్లిన సంగ‌తి తెలిసిందే. అయితే టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్... గోవాలో ఎంజాయ్ చేస్తున్నారు.  భార్య ఉపాసనతో కలిసి ఆయన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం గోవాల వెళ్లారు. ఆర్ఆర్ఆర్ చిత్రానికి చిన్న బ్రేక్ ఇచ్చి ఉపాసనతో కలిసి అక్కడికి చెర్రీ వెళ్లాడని తెలుస్తుంది. జనవరి 3న ఆయన తిరిగి హైదరాబాద్‌కి వస్తారు. ఆ వెంటనే షూటింగ్ వర్క్‌తో బిజీ కానున్నాడు. కాగా, టాలీవుడ్‌లోనే టాప్ డైరెక్టర్ దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న‌ `ఆర్ఆర్ఆర్` చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్నాడు.  

 

డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా.. తారక్ కొమరం భీంగా నటిస్తున్నారు. ఇక ఇటీవలే ఈ చిత్రం ఔట్ డోర్ లోకేషన్లో షూటింగ్ జరిగింది. జూన్ 30లోగా సినిమాను రిలీజ్ చేయాలని జక్కన్న గట్టి పట్టుదలతో ఉన్నారు. అయితే అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్న రామ్ చరణ్ మరో వైపు చిరు 152వ సినిమాకి సంబంధించిన నిర్మాణ బాధ్యతలని కూడా చూసుకుంటున్నారు. ఫిబ్రవరి వరకు ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ పూర్తి చేసి ఆ తర్వాత మరో సినిమాని మొదలు పెట్టాలని రామ్ చరణ్ ప్లాన్ చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: