నూతన సంవత్సరం రోజున కస్టమర్ల ను ఆకట్టుకునేందు ఒక వస్త్ర దుకాణ యజమాని వినూత్నంగా చేసిన ఆలోచన వల్ల మొదటికే మోసం తెచ్చింది  . కస్టమర్ల కు  నూతన సంవత్సరం రోజున  రూపాయికే చీర ఇవ్వాలని షాప్ యజమాని నిర్ణయించుకున్నాడు . ఇంతవరకు అంతాబాగానే ఉంది . కానీ రూపాయికే చీర అనడం తో కస్టమర్లు ఎగబడ్డారు . వారిని అదుపు చేయడం షాప్ సిబ్బంది వల్ల కాలేదు . దాంతో ఎవరి చేతికి దొరికింది వారు పట్టుకెళ్లారు .

 

 దీనిలో షాప్ యజమాని లభో, దిభో మంటూ పోలీసుల్నీ ఆశ్రయించాడు . ఈ సంఘటన ఎక్కడో కాదు తూర్పు గోదావరి జిల్లా అమలాపురం లో చోటు చేసుకుంది . ఇక ఏపీ లో  రూపాయికే చీర ఆఫర్ ప్రకటించిన వస్త్ర యజమాని కంగు తినగా , తమిళనాడు తిరుత్తణిలోని మరొక వస్త్ర వ్యాపారి తెలివైన ఆలోచన చేశాడు . మనుగడలో లేని 20  పైసలు తీసుకు వస్తే, 300  రూపాయల  టి షర్ట్ ఇస్తానని ప్రకటించాడు . అయితే ఇందులోనూ షరతులు వర్తిస్తాయని పేర్కొన్నాడు .

 

తొలి వంద మందికి మాత్రమే టి షర్ట్ లను అందజేయనున్నట్లు చెప్పాడు. నూతన సంవత్సరం రోజున సదరు షాప్ ముందు మనుగడలో లేని 20  పైసల నాణేన్ని పట్టుకుని యువత పొలోమంటూ క్యూ కట్టారు . వస్త్ర యజమాని ముందుగానే ప్రకటించినట్లు తొలి వంద మందికి టి షర్ట్ లను అందజేసి , చేతులు దులుపుకున్నాడు. 20  పైసలకే టి షర్ట్ దక్కించుకున్న వారు సంతోషంతో ఇళ్లకు వెనుతిరగగా , దక్కని వారు మాత్రం నిరాశ తో ఇంటి ముఖం పట్టారు . తమ పబ్లిసిటీ కోసం వస్త్ర వ్యాపారాలు ఈ తరహా ఆలోచనలు చేయడం సర్వ సాధారణమే … అయినా ముందు జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం కొంప కొల్లేరవుతుంది మన అమలాపురం వస్త్ర వ్యాపారి మాదిరిగా .

మరింత సమాచారం తెలుసుకోండి: