బెల్లం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి.. కాని కొంతమంది పంచదారని ఎక్కువగా ఉపయోగిస్తారు... పంచదార కంటే బెల్లం వల్లనే చాలా ప్రయోజనాలు ఉన్నాయి.. బెల్లంలో ఎలాంటి రసాయనాలు దాదాపుగా కలవవు.

 


బెల్లంలో ప్రోటీన్లు, ఫైబర్స్, మినరల్స్, కేలరీలు సమృద్ధిగా ఉంటాయి. బెల్లం చెరుకు గడ నుంచి దీన్ని తయారు చేస్తారు కాబట్టి రుచి కూడా బాగా ఉంటుంది. ఇందులో సుక్రోజ్ 50%, 20% తేమ, 20% చక్కెర, పోషకాలు ఉంటాయి.ఫైబర్స్ ఉంటాయి కాబట్టి మలబద్దకం అనేది ఉండదు... జీర్ణక్రియ ప్రక్రియ బాగా జరుగుతుంది. దీనివల్ల బరువు కూడా పెరగరు.. తిన్న ఆహారం సులభంగా జీర్ణం అయ్యేందుకు బెల్లం చాలా ఉపయోగపడుతుంది.

 

బెల్లం రక్తాన్ని కూడా శుభ్రపరుస్తుంది. శరీరంలో ఉన్న విష పదార్థాలు, మలినాలు బయటకు వెళ్లేలా చేస్తుంది. అధిక బరువు తగ్గేందుకు సహాయపడుతుంది.అలాగే బెల్లం లో పొటాషియం, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి.. దీనివల్ల శరీరంలో అతిగా నిల్వఉన్న నీటిని బెల్లం లో ఉండే పొటాషియం, మినిరల్స్ బయటకి పంపిస్తాయి... శరీరంలో నీటి శాతం తగ్గుంది.

 

ఫలితముగా బరువు సమస్య తగ్గుతుంది. బెల్లంలో విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ ఎలక్ట్రోలైట్ సమతుల్యత ఉండేలా చేస్తాయి. అలాగే జీవక్రియ మెరుగవుతుంది.అలాగే బెల్లంలో ఐరన్ బాగా ఉంటుంది. దీనివల్ల శరీరంలో రక్తం శాతం పెరుగుతుంది. అందువల్ల బెల్లం ని ప్రతిరోజు ఎదో ఒక రూపంలో తింటూ ఉండాలి.. చిన్నపిల్లల్లో ఎక్కువగా రక్త శాతం తక్కువగా ఉంటుంది.. అందుకని వాళ్ళకి వేరుశెనగ పప్పుని బెల్లం పాకంతో కలిపి పప్పు ఉండ లాంటివి చేసి రోజు పెడుతూ ఉండాలి. అలాగే బెల్లం టీ కూడా ఎంత మంచిది.. బెల్లం టీని రోజూ తాగితే చాలా రకాల ప్రయోజనాలున్నాయి. మీ శరీరంలో క్యాలరీలు కరిగించడానికి బెల్లం టీ ఉపయోగపడుతుంది. చక్కెరలో ఉండే హానికరమైన గుణాలు బెల్లంలో ఉండవు కాబట్టి మీ ఆరోగ్యం బాగుంటుంది.

 

బెల్లన్ని అతిగా తింటే బరువు తగ్గడం బదులుగా బరువు పెరిగే అవకాశం ఉంది
బెల్లం తింటే బరువు తగ్గుతామని చెప్పి రోజూ అదేపనిగా బెల్లం తినడం సరికాదు. రోజూ 2 స్పూన్ల బెల్లం లేదా బెల్లం పొడి తింటే చాలు.అతిగా తినకూడదు.. ఎంతతింటే అంతే మేలు... ఇన్ని ఉపయోగాలు ఉంటే బెల్లం తినకుండా ఉంటామా !!!!

మరింత సమాచారం తెలుసుకోండి: