న్యూ ఇయర్ వచ్చేసింది. వచ్చి రెండు రోజులు అయ్యింది.. ఎందుకు దీనిపైనే మళ్ళి మళ్ళి అని మీకు సందేహం వస్తుంది. కానీ మనం అంత అన్ని తెలుసుకోవాలి కదా.. ఎక్కడ ఎలా జరిగింది అనేది. ఎక్కడైన జరిగిన సెలబ్రేషన్ మీకు బాగా నచ్చింది అనుకోండి.. మీరు అక్కడికి వెళ్లి చూస్తారు కదా? అందుకే ఇలా.. 

 

సరే.. మనం కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించాం.. ఆనందంగా ఆహ్వానించాం. అలానే న్యూ ఇయర్ వేడుకులు ప్రపంచమంతా ఎంతో అద్భుతంగా జరుపుకున్నారు. ఓకో చోట ఒకో ప్రత్యేకతతో ఈ వేడుకలను ప్రజలు జరుపుకున్నారు. అయితే ఈ వేడుకలు అత్యంత అద్భుతంగా ఎక్కడ జరుపుకున్నారు అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

అమెరికాలో నూతన సంవత్సరం వేడుకలు ఘనంగా జరిగాయి. కొత్త దశాబ్దిని అమెరికావాసులు ఉత్సాహంగా ఆహ్వానించారు. న్యూయార్క్‌లోని టైమ్‌ స్క్వేర్‌ ప్రాంతంలో ప్రజలు భారీ సంఖ్యలో గుమిగూడి ఉత్సాహాలు జరుపుకున్నారు. కొత్త ఏడాదిని ఎంతో ఆనందంతో ఆహ్వానించారు. 

 

బ్రిటన్‌ రాజధాని లండన్‌లో థేమ్స్‌ నదితీరాన మిలినియం వీల్‌ వద్ద సంబరాలు అంబరాన్ని అంటాయి. రష్యా రాజధాని మాస్కోలోని అధ్యక్ష భవనం క్రెమ్లిన్‌ వద్ద కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రీస్‌లో అయితే కొత్త సంవత్సరన్నీ సరికొత్తగా చేసుకున్నారు. 

 

అయితే ప్రపంచవ్యాప్తంగా ఎన్ని న్యూ ఇయర్ వేడుకలు జరిగిన.. దుబాయ్‌లోని బుర్జ్‌ ఖలీఫా వద్ద మాత్రం ఆకాశాన్నంటిన కొత్త ఏడాది సంబురాలు చేశారు. అంతర్జాతీయంగా జరిగే న్యూ ఇయర్ వేడుకలకు దుబాయ్ వేదిక. నెక్స్ట్ టైం న్యూ ఇయర్ వేడుకలు చూడాలి అనుకుంటే దుబాయ్ కి వెళ్లి చుడండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: