ఏంటి చికెన్ మరియు టీ కాంబినేషన్ ఏంటి అని అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమే.. ఒక వనిత ఈ రెండిటి కాంబినేషన్ లో ఒక రెసిపీ చేసి సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది.. కొత్తరకం ప్రయోగం చేసి పాపులారిటీ సంపాదించాలని చూసింది.. సాధారణంగా ఛాయ్ తాగడాన్ని చాలామంది ఇష్టపడుతుంటారు. రోజుకు పది కప్పులకు తగ్గకుండా తాగే ఛాయ్ ప్రియులూ ఉంటారు.

 

అలాగే చికెన్‌ ప్రియులూ. రోజూ చికెన్ పెట్టినా సరే ఎంచక్కా లాగించేస్తారు. కానీ ఒక్కసారి ఊహించుకోండి.. ఛాయ్‌లో చికెన్ ముంచుకు తింటే ఎలా ఉంటుంది. ఛా.. అదేమి కాంబినేషన్ అనుకుంటున్నారా..? అవును, ఈ కొత్త రకం ప్రయోగంతో ఓ వనిత సోషల్ మీడియాలో జనాలను బెంబేలెత్తించింది.కానీ ఈ ఐడియా తనదికాదట.. పోకొస్‌చిక్ అనే ఓ రెడ్డిట్ యూజర్ ఛాయ్‌లో చికెన్ టిక్కాను ముంచుకు తినే వీడియోను పోస్ట్ చేసింది.

 

దాని ఫలితమే ఇలా !!ఇంతకుముందు ఛాయ్‌లో ఇడ్లీ ముంచుకు తినే వీడియో పోస్ట్ చేస్తే.. తదుపరి వీడియోలో ఛాయ్,చికెన్ కాంబినేషన్ ప్రయత్నించమని ఓ నెటిజెన్ సలహా ఇచ్చాడట... నెటిజన్ ఇచ్చిన సలహా మేర ఈ వనిత రెసిపీ చేసింది.. ఈవిడ చాయ్ చికెన్ కి నెటిజన్స్ దండాలు పెడుతూ కామెంట్స్ చేస్తున్నారు.  ఇక ఈ ప్రయోగంపై ఓ నెటిజెన్ స్పందిస్తూ.. 'పాపం ఆ చికెన్.. రెండుసార్లు హత్య చేయబడింది..' అని కామెంట్ చేశాడు. మరో నెటిజెన్.. 'మమ్మల్ని హింసించడం కాస్త ఆపు..' అంటూ కామెంట్ చేశాడు.

 

 

ఇక మరో నెటిజెన్.. 'ఈసారి జిలేబీని సాంబార్‌తో టేస్ట్ చేయండి' అని మరో కొత్త సలహా ఇచ్చాడు..... సోషల్ మీడియా లో ఫుడ్ ఐటమ్ వీడియోస్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు... అందుకని ఎవరికీ నచ్చినట్లు వారు వీడియోస్ పెడుతుంటారు... ఈ చాయ్ చికెన్ కాంబినేషన్ కూడా వెరైటీ కదా..... 

మరింత సమాచారం తెలుసుకోండి: