విమానయాన సేవలను చాలా శుభ్రంగా ఉంచడం వాటిని నడిపే యాజమాన్యం యొక్క ముఖ్య బాధ్యత. గాల్లో ఎగురుతున్న విమానంలో ఏ చిన్న పురుగు, పక్షి, జంతువు ఇంకా మరేతర జీవి వచ్చినా.. ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే, ఆ జీవులు విమానంలో ఏదైనా పరికరాలను పాడుచేస్తే.. అది ప్రాణాంతంకంగా మారుతుంది. అయితే, ఇండిగో విమానంలో ఆకస్మాత్తుగా ఒక బొద్దింక ప్రత్యక్షమైతే.. ఆ స్టాఫ్ దాన్ని పెట్టుకోకుండా అడ్జస్ట్ చేసుకోండి సార్ అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు.


వివరాల్లోకి పోతే, పూణే లోని కోత్రుడ్ నివాసితులు అయిన స్కంద్ బాజ్‌పాయ్, సురభి భరద్వాజ్ ఇద్దరూ డిసెంబర్ 31, 2018న పూణే నుంచి ఢిల్లీ వెళ్లే ఒక ఇండిగో విమానాన్ని ఎక్కారు. తరువాత అది గాల్లోకి ఎగరడం ప్రారంభించింది. ఈ ఇద్దరు ప్రయాణికులు విమాన కిటికీ నుంచి బయటకు చూస్తూ వారి ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఆ సందర్భంలోనే వారు కూర్చున్న సీట్ లో ఒక బొద్దింక ప్రత్యక్షం అయింది. దాంతో హడిలిపోయిన వారు వెంటనే ఆ విమానంలో ఉన్నటువంటి సిబ్బందిని పిలిచారు. ఏం ప్రమాదం జరిగిందోనని వాళ్లు చకచకా వీరి సీట్ వద్దకు వచ్చి చూస్తే ఒక బొద్దింక కనిపించింది. పట్టుకుందామనుకునే లోపు అది తప్పించుకొని ఎక్కడికో వెళ్ళిపోయింది. బొద్దింకే కదా సార్ లైట్ తీసుకోండి ఏం కాదు అని సిబ్బంది చెప్పారు. కానీ ఆ ఇద్దరు ప్రయాణికులు బొద్దింక వలన అంటువ్యాధులు వచ్చే ప్రమాదముందని, వెంటనే పట్టుకోండని సిబ్బందిని డిమాండ్ చేసారు. కానీ ఆ బొద్దింక దొరకదని కావాలంటే ఫిర్యాదు చేసుకోండి అని అంటూ ఆ సిబ్బింది అక్కడి నుంచి వెళ్లిపోయారు.




దాంతో స్కంద్ బాజ్‌పాయ్, సురభి భరద్వాజ్ ఇద్దరూ డిసెంబర్ 31, 2018న వారికి విమానంలో ఎదురైనా చేదు అనుభవాన్ని మొదటిగా ఆయా ఇండిగో విమాన సంస్థకు కంప్లైంట్ చేసారు. వాళ్లు కూడా పట్టించుకోకపోయేసరికి పూణే కన్స్యూమర్ ఫోరమ్‌ కోర్టుకు ఫిర్యాదు చేశారు. అప్పుడు, వాళ్లు ఇండిగో విమాన సంస్థకు నోటీసులు పంపించారు. కానీ ఆ నిర్వాహకుల నుండి ఎటువంటి స్పందన లేదు. దాంతో, చిర్రెత్తిపోయిన పూణే డిస్ట్రిక్ట్ కోర్టు 50వేల రూపాయల జరిమానాను విమాన సంస్థకి విధించింది. అలాగే, ఆ విమానంలో ప్రయాణించేందుకు ఆ ఇద్దరు డిసెంబర్31న కొనుగోలు చేసిన టికెట్ల ఖర్చు రూ.8574ని కూడా చెల్లించవల్సిందిగా తీర్పు ఇచ్చింది కోర్టు. దాంతో ఇద్దరి ప్రయాణికుల ఈ బొద్దింక పోరాటంలో గెలిచారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: