ఇంటికి ఎవ‌రైనా వ‌చ్చిన‌ప్పుడు అప్ప‌ట్లో అమ్మాయిలు మాట్లాడ‌టానికి చాలా మొహ‌మాట ప‌డేవారు. త్వ‌ర‌గా అంద‌రిలోనూ క‌లిసేవారు కాదు. అది ఒక‌ర‌క‌మైన గౌర‌వం పెద్ద‌ల‌కిచ్చే గౌర‌వ మ‌ర్యాద‌ల‌తో మాట్లాడేవారు కాదు. నాలుగు ముక్క‌లు మాట్లాడ్డం రాక‌పోయినా.. నాలుగు పాట‌లు పాడ‌మంటే మాత్రం మా అమ్మాయి త‌ర్వాతే.. అని నోరంతా తిప్పుకొని చెప్పేవారు అప్ప‌ట్లో త‌ల్ల‌లు. త‌మ పిల్ల‌ల గురించి ఎంత చ‌క్క‌గా చెప్పుకునేవారో. ఇప్పుడు ఏ అమ్మాయి అయినా స‌రే నోరు తెరిస్తే చ‌క్క‌టి తెలుగు భాష‌తో మాట్లాడ‌ట‌మే రావ‌డం లేదు. ఇంక పాట‌లేమి పాడ‌తారు. పాట‌లు పాడే అమ్మాయిలే క‌రువ‌య్యారు. 

 

ఎక్క‌డో ఒకచోట సంగీతం మీద ప్యాష‌న్ ఉన్న వాళ్ళు త‌ప్పించి ఎవ్వ‌రూ పెద్ద‌గా నేర్చుకోవ‌డం లేదు. అస‌లు క్లాసిక్ వైపే తిరిగి చూడ‌టం లేదు ఈ కాలం అమ్మాయిలు. అంతా మోడ్ర‌న్‌గా ఫోక్ డ్యాన్స్‌లు, ఫోక్ మ్యూజిక్‌, వెస్ట్ర‌న్ మ్యూజిక్ మీద ఎక్కువ ఇంట్ర‌స్ట్ చూపిస్తున్నారు.  ఒక‌ప్పుడు సంక్రాంతి పండ‌గా దాదాపుగా ప‌న్నెండు రోజుల ముందునుంచే మొద‌లు పెడ‌తారు. సంక్రాంతి అంటే అమ్మాయిల‌కి ముందుగా గుర్తుకు వ‌చ్చేది ముగ్గులు వీధిలో పెద్ పెద్ద ముగ్గులు వేయ‌డం అందులో మ‌ళ్ళీ పోటీ ఎవ‌రు పెద్ద ముగ్గు వేశారా అని మ‌ళ్ళీ అందులోనూ ఎన్ని చుక్క‌లు, ఎన్ని గ‌డులు అని ప‌క్క‌న ముగ్గుతో రాసేవారు కూడా అంత లెక్క‌గా ఉండేవారు. పండ‌గ‌రోజు సంక్రాంతి రోజు మాత్రం వీధి మొత్తం రంగుల‌తో నిండిపోయేది. రంగు రంగుల ముగ్గు. అలాగే పండ‌గ చివ‌రి రోజు ముక్క‌నుమ రోజు ర‌ధం ముగ్గు వేసి ర‌ధానికి పెద్ద తాడువేసి లాగుతున్న‌ట్టు వేసి ముగ్గుల‌ను ముగించేవారు. ఇప్పుడు అంత ఓపిక ఎవ‌రికి ఉంటుంది. అస‌లు ఇప్ప‌టి అమ్మాయిల‌కి ముగ్గులు వేయ‌డం ఎక్క‌డ వ‌స్తుంది. ఒక‌వేళ వేయాల‌నిపించినా పండ‌గ‌రోజు ఏదో యూట్యూబ్‌లోనూ, సెల్‌ఫోన్ ముంద‌ర పెట్టుకుని డిజైన్స్ చూస్తూ క‌ష్ట‌ప‌డి ఒక్క‌రోజు ముగ్గు వేయ‌డం గ‌గ‌నం అయిపోయింది. 

 

పండ‌గ‌కో ప‌బ్బానికో క‌లిసే చుట్టాలు అంద‌రూ క‌లిస్తే స‌ర‌దాగా ఆట‌పాట‌లు అన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు అలా  కాదు.  న‌లుగురు క‌లిసినా పెద్ద‌గా ఎవ్వ‌రూ మాట్లాడుకోవ‌డం లేదు. ఏదో త‌ప్ప‌దు క‌దా అన్న‌ట్లుగా హాయ్ అంటే హాయ్ అని ప‌ల‌క‌రించుకుని ఎవ‌రి స్మార్ట్ ఫోన్ వారు చేతిలో ప‌ట్టుకుని టిక్‌టాక్‌లు, ఫేస్‌బుక్‌లు, వాట్సాప్‌లు  ఎక్కువ‌యిపోయాయి. ఎదురుగా ఉన్న మ‌నిషితోక‌న్నా ఫోన్‌తో మాట్లాడ‌టం ఎక్కువ‌యిపోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: