ఏదైనా పండగ వచ్చిందంటే చాలు ఎక్కడెక్కడో ఉన్న కుటుంబ సభ్యులు అంతా ఏకమై సంతోషంగా పండుగను జరుపుకుంటారు. కుటుంబాలకు కుటుంబాలే కలిసి పండగలను ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. పండగల్లో బావా మరదళ్ల సరదాలు, సరసాలు, విరసాలు సాధారణంగా ఉంటాయి. బావగారిని మరదలు కాసేపు ఆటపట్టిస్తే బావగారు మరదలిని కూడా ఆట పట్టిస్తూ సరదాగా ఏడిపిస్తూ అలక పూనితే మరలా బుజ్జగిస్తూ ఉంటారు. 
 
బావామరదలు చెట్టాపట్టాలేసుకుని ఊరంతా తిరుగుతూ ఉంటారు. బావా మరదళ్లు ఒకే చోట ఉన్నారంటే నవ్వుల పువ్వులు పూయాల్సిందే. కొందరు బావా మరదళ్ల మధ్య ప్రేమ కూడా వెల్లివిరిసి ఆ ప్రేమ పెళ్లికి కూడా దారితీస్తుంది. కానీ ఇదంతా గతం. ప్రస్తుత యాంత్రిక జీవితంలో బావా మరదళ్లైనప్పటికీ చాలామందికి ఒకరి పేర్లు కూడా మరొకరికి తెలియని స్థితిలో ఉన్నారు. క్రమక్రమంగా బావా మరదళ్ల సరదాలు, గిల్లికజ్జాలు, ఆటపట్టించటాలు కూడా తగ్గిపోతున్నాయి. 
 
ఒకప్పుడు కుటుంబాలకు కుటుంబాలు కలిసి పండగలు చేసుకుంటే నేటి కాలంలో పండగలు ఎవరింట్లో వారు చేసుకుంటున్నారు. నేటి కాలంలో చాలామంది పిల్లలకు ఎవరు ఏమి అవుతారో కూడా తెలియని స్థితిలో ఉన్నారు. ఒకప్పుడు బావ సరదాలు, మరదలి అలకలతో జరిగిన పండుగలు నేడు బావా మరదళ్ల మధ్య ఏ మాత్రం ఆప్యాయత, ప్రేమ లేకుండా కొంతమంది బావా మరదళ్లకు ప్రస్తుత కాలంలో కనీసం పరిచయాలు కూడా లేకుండా ఉండటం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: