మండే వేసవిలో మనసు దోచేవి మల్లెపూలు.. ఒకప్పుడు వేసవికాలం వచ్చిందంటే ఆడపిల్లలకు మురిపెంగా ఒక్కసారైనా పూలజడ వేసి మురిసిపోయేవారు. అప్ప‌టి అమ్మ‌మ్మ‌లు సెల‌వుల‌కు వెళ్ళిన మ‌న‌వ‌రాలికి చ‌క్క‌గా పూల జ‌డ వెయించి ఎంతో ఆనంద‌ప‌డిపోయేవారు.  అపురూపమైన ఈ పూలజడ ముచ్చటను ఫొటోలు దిగి, దాచుకున్న పెద్దవాళ్లు మనలో చాలామందే ఇప్పుడు ఉండుంటారు. అలాంటి అపురూపమైన పూలజడ సంస్క‌కృతిని కొనసాగించేవారు. అలాగే చ‌క్క‌గా రెండు జ‌డ‌లు పైకి క‌ట్టుకుని జుట్టును ఎంతో జాగ్ర‌త్త‌గా చూసుకునేవారు ఆనాటి ఆడ‌పిల్ల‌లు. 

 

కేవ‌లం వారానికి ఒక్క‌రోజు మాత్రం త‌ల‌స్నానం చేసి పెద్ద జ‌డ వేసుకుని త‌ల నిండా పువ్వులు పెట్టుకుని ఎంతో అందంగా రెడీ అయ్యేవారు అప్ప‌టి అమ్మాయిలు. నిండుజడ, పాయల జడ, వంకుల జడ, పలకల జడ, చక్రాల జడ, పట్టెడు జడ, డైమండ్ జడ, పేర్ల జడ, పాము పడగ జడ, పుల్లల జడ, రెడీమేడ్ జడ వంటి ఎన్నో రకాల పూలజడలు ప్రాచుర్యం పొందాయి. ఏ రకమైన పూలజడను వేయాలో ముందుగానే నిశ్చయించుకుని పూలజడను రూపొందిస్తారు. పొడవాటి జుట్టు లేనివారి జడకు సవరం జతచేసి పూలజడ అల్లిక చేస్తారు. ఆధునికత ఎంత వచ్చి చేరినా వేడుకల్లోనూ, అలంకరణలోనూ పూలజడ స్థానం ఎప్పటికీ చెక్కుచెదరనిది పూల‌జ‌డ‌.

 

గతంలో మల్లెలు, జాజులు, కాడమల్లె, కనకాంబరాలు, మరువం వంటి పూలను మాత్రమే పూలజడలకు ఉపయోగించేవారు. ఇవి మోయడానికి కాస్త బరువుగా ఉంటాయి. కానీ చూడటానికి అందంగా ఉంటాయి. మునుపు జడ అల్లిక బాగా వచ్చిన బామ్మలో, మేనత్తలో జడలను అల్లేవారు. నేటితరం అమ్మాయిలకి జడ వేయాలన్నా కూడా హెయిర్ స్టైలిస్టులు రావాల్సిందే.. లేదంటే జడల అల్లికలో బాగా నైపుణ్యం ఉన్నవాళ్లే వేయాలి. ఎందుకంటే పూలజడ కోసమైనా ఏదో సాదా సీదా జడ అల్లేస్తే అస్సలు కుదరదు మరి. ముందుభాగంలో పఫ్ మాదిరిగా పైకి లేచినట్లో, మెలి తిప్పినట్లో, పై భాగంలో కిరీటం పెట్టినట్లో, పక్కకు దువ్వినట్లో.. ఇలా రకరకాలుగా.. అమ్మాయి ముఖానికి సరిపోయే విధంగా జడను అల్లి, ఆర్ట్ఫిషయల్ లేదా తాజా పూలజడను జడకు కట్టేస్తారు. పెళ్లిలో అయితే జడకుప్పెలు పెట్టి పూలజడ అల్లుతారు కానీ రిసెప్షన్‌కు అయితే ప్రత్యేకమైన హెయిర్ స్టైల్స్‌ను వేసుకుంటారు నేటితరం అమ్మాయిలు. 

 

ఇప్ప‌టి అమ్మాయిల‌కి అస‌లు జ‌డే ఉండ‌దు ఇంక పూలు ఎక్కెడ పెట్టుకుంటారు. చిన్న చిన్న పిల‌క‌ల్లాగా ఉంటాయి. నేటి త‌రం అమ్మాయిలు బరువు వద్దనుకునే అమ్మాయిలకు ఆర్ట్ఫిషియల్ పూలు, పూసలు, చకీలు, వన్‌గ్రామ్ జడ బిళ్లలతో పూలజడలు తయారై జ‌డ ఆర్టిఫిషియ‌లే, అందులోని పూలు ఆర్టిఫిషియ‌ల్ అయిపోయాయి.   ప్రత్యేకమైన హెయిర్ స్టైల్స్‌ను వేసుకుంటున్నారు నేటితరం అమ్మాయిలు. కాస్త వెరైటీగా, వేసుకున్న డ్రెస్‌కు నప్పేలా సిగల్ని చుట్టడం, లేదా రింగులు తిప్పి వెంట్రుకల్ని వదిలేయడం చేస్తున్నారు. ఈ స్టైల్‌కి తగ్గట్లు గినె్నపూలు, ఆర్కిడ్‌లు, కార్నేషన్‌లు, చేమంతులు, గులాబీ రేకులు, మల్లెలుతో పాటు బంగారు పూత పూసిన లోహపు ప్లాస్టిక్ పూలను కూడా రకరకాల పద్ధతుల్లో అందంగా అలంకరిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: