కాలం మారింది .. మానవజాతి మనుగడ కూడా పూర్తిగా మారింది..డబ్బు పై వ్యామోహం కూడా బాగా పెరిగింది.. అందుకే ఇప్పుడు జనాలకు కడుపు నిండా తిండి లేదు కడుపు నిండా నిద్ర లేదు అందుకే ఈ మధ్య  ప్రపంచం కూడా పూర్తిగా మారిందనే చెప్పాలి.. మానవాళి స్థితి గతులు కూడా పూర్తిగా మారాయి..ఉరుకుల పరుగుల జీవితానికి అలవాటు పడ్డారు..

 

ప్రపంచం ఎంత స్పీడ్ గా తిరుగుతుంటే మనుషులు కూడా అలానే తిరుగుతున్నారు అది ఇప్పటి భాగోతం.. మనుషుల మధ్య ఆప్యాయత పలకరింపులు అనేవి ఒక్క పల్లె వాతావరణము లో తప్ప ఎక్కడ వెతికినా కనిపించలేదు.. పండుగలోస్తే నా కుటుంబం ఉంది అని ఈ మధ్య జనాలు ఆలోచిస్తున్నారు..ఇంకా చెప్పాలంటే కుటుంబం అనేది పదాన్ని గూగుల్ చేస్తున్నారు అని చెప్పాలి..

 

ఇప్పుడు ఎవ‌రి నోట విన్నా ఇదే మాట వినిపిస్తోంది. అంద‌రికీ ఉన్న‌ది 24 గంట‌లే అయినా.. త‌మ కుటుంబంతో ఓ గంట వెచ్చించే స‌మ‌యం లేక ఇబ్బంది ప‌డుతున్న కుటుంబాలు పెరుగుతున్నాయి. దీని వ‌ల్ల తీవ్ర‌మైన మాననిస‌క ఒత్తిళ్ల‌కు కూడా గుర‌వుతున్నారు.. మనసులో మాటల గురించి మరొకరు చెప్పాలంటే వినడం అనే మాట కూడా ఇప్పటి జనాల్లో లేదు.

 

భార్యాభర్తలు విషయానికొస్తే ఇంకా చెప్పనక్కర్లేదు అనుకోండి..భర్తకు ప్రేమగా ఎదైనా వండి పెట్టాలి అని, అతనితో సరదాగా షికారు కు వెళ్లాలని అనుకొంటారు. .. కానీ ఈ మెట్రో లైఫ్ లో పని చేసి వచ్చిన భర్త మాత్రం నాకు ఓపికలేదు..నాకు అంత టైం కూడా లేదని అనడం ఈరోజుల్లో కామన్ అయిపోయింది.. అందుకే కాబోలు ఎక్కడ పడితే అక్కడ విడిపోవడానికి చర్చలు జరుగుతున్నాయి..అందుకే డబ్బు మీద ఆశ ఉండాలి కానీ, డబ్బు కన్నా విలువైన మనుషులను కూడా చూడాలని పెద్దలు అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: