నాటి తరం కుటుంబం అంటే ఎన్నో ఆప్యాయతలు అనుబంధాలు ఎంతో గౌరవం.. అమ్మ నాన్న అక్క చెల్లి తాతయ్య నానమ్మ ఇలా ప్రేమతో పిలుస్తుంటే మనసు పులకరించిపోయేది. నేటి చిన్న కుటుంబాల కంటే నాటి ఉమ్మడి కుటుంబాలు ఎంతో ఆనందంగా ఉండేవి . మన కన్న తల్లిదండ్రులను అమ్మ అని ఆప్యాయంగా పిలుస్తూ ఉంటే అమ్మ మనసు పులకరించి పోయి... ఎంతో ఆనంద పడేది. మనకి తొలి అడుగులు నేర్పిన తండ్రిని నాన్న అంటూ పిలిస్తే నా కొడుకు నన్ను నాన్న అని పిలిచాడు అని  నాన్న మనసు ఉప్పొంగిపోయింది. కానీ నీటి రోజులు అమ్మానాన్నలు పోయి మమ్మీ డాడీ లు  వచ్చేసాయి. నాటి తరానికి నేటి తరానికి ఎంతో తేడా ఉంది.. జీవనశైలి లోనే కాదు అమ్మా నాన్నల మీద ప్రేమ ఆప్యాయతలు చూపించడంలో కూడా ఎంతో తేడా ఉంది. ఒకప్పుడు అమ్మ నాన్న అంటూ ఆప్యాయంగా పిలిచే వాళ్ళు ఎప్పుడు మమ్మీ డాడీ అంటూ పిలవడం మొదలుపెట్టారు. 

 


 ప్రస్తుతం మమ్మీ డాడీ అనే మాటలు గొంతునుంచి తప్ప మనసు నుంచి వచ్చినట్లుగా మాత్రం కనిపించదు అనిపించదు . అమ్మ నాన్న అనే పేరులో ఉన్న ఆప్యాయత అనురాగం మమ్మీ డాడీ అనే పదాలలో మాత్రం ఎక్కడా కనిపించదు. పాశ్చాత్య పోకడలు పోతూ  తెలుగు సంస్కృతిని బొత్తిగా మరిచిపోతున్నారు నేటితరం యువత. అమ్మ నాన్న అని పిలిస్తే ఈ రెండు ప్రాంతాలలో ఎంతో గౌరవం కనిపించేది. కానీ మమ్మీ డాడీ లో ఆ గౌరవం ఎక్కడిది. ఒక్క  మమ్మీ డాడీ గురించి కాదు ఏ విషయంలోనే ప్రతి ఒక్కరిని  అసలు ఆప్యాయత లేకుండా పిలుస్తున్నారు. ఒకప్పుడు అమ్మ నాన్న అని పిలవడానికి తహతహలాడిపోయే వాళ్లు. కానీ ఇప్పుడు పాశ్చాత్య పోకడలకు అలవాటుపడి అమ్మ నాన్న అని తెలుగు పదాలతో పిలవాలంటే నామోషీగా ఫీల్ అవుతున్నారు.

 

 మమ్మీ డాడీ అంటే అదొక  గ్రేట్నెస్ అని అనుకుంటున్నారు. ఎంత విద్యావంతులైన ఎంత డబ్బు సంపాదించినా ఏ స్థాయిలో ఉన్న... కన్న తల్లిదండ్రులను అమ్మ నాన్న అని పిలుపు లో ఉన్న ఆనందం మరే విషయంలోనూ దొరకదని చెప్పాలి. మనిషి జీవితానికి పాశ్చ పోకడ అవసరమైనది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా... మారుతున్న నాగరికతకు అనుగుణంగా మనుషులు మారుతూ ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆధునిక యుగంలో ముందుకు సాగాలంటే పాశ్చాత్య పోకడలను అలవాటు చేసుకోవాల్సిందే. కానీ ఎంత ఎత్తుకు ఎదిగినా మనుషుల మూలాలు ఎక్కడున్నాయో అది గుర్తు పెట్టుకోవాలి. అమ్మ నాన్న అనే పిలుపు ఎంత  అందమైనదో గ్రహించాలి. దేశభాషలందు తెలుగు లెస్స అని అన్నారు మహానుభావులు. అందుకే ఈ మమ్మీ డాడీ పదాలను వదిలేసి... తల్లిదండ్రులను ప్రేమతో అమ్మా నాన్న అని పిలుద్దాం .

మరింత సమాచారం తెలుసుకోండి: