ఆనాటి ఈ బంధం ఏనాటిదో... అన్నట్లు గా ఉండేది భార్య భర్తల మధ్య అనుబంధం. నాటి రోజుల్లో ఒకరినొకరు ఎంతో గౌరవించుకునే వారు. ఒకరిపై ఒకరికి ఒక బాధ్యత... ప్రేమ ఆప్యాయతలు కనిపించేది. నాటితరం భార్యలు భర్తల కు ఎనలేని గౌరవం ఇచ్చేవారు. ఏవండీ అంటూ ప్రేమగా పిలిచి గౌరవం ఇచ్చేవారు. ఏవండి అది తీసుకు రమ్మంటారా... ఏవండీ  ఇది తీసుకు రమ్మంటారా అంటూ భార్యలు అంటుంటే... భక్తులందరూ లోలోపల ఎంతో ఆనంద పడుతున్నప్పటికీ బయటకి మాత్రం కాస్త గంభీరంగానే కనిపించేవాళ్ళు. ఆనాటి కాలంలో భర్తను భార్య పిలవాలి అనుకున్నప్పుడు ఏవండి అని  తప్ప మరో మాట అనేది కాదు. ఎంతో గౌరవం ఇస్తూ ఏవండీ అని పిలిచేవాళ్ళు. భర్తను ఏవండీ అని పిలవడం లో ఎంతో ఆప్యాయత అనురాగం కూడా కనిపించేది. కానీ నేటి తరం భార్యభర్తల్లో ఇవన్నీ ఎక్కడ మచ్చుకైనా కనిపించటం లేదు . 

 


 ఒకప్పుడు భార్యలందరు  ప్రేమతో భర్తను ఏవండి అని పిలుచుకునేవారు. కానీ నేటి తరంలో మాత్రం ఏవండి అనే పదం మాత్రం కనుమరుగైపోయింది. చిత్రవిచిత్రమైన పేర్ల  తో తమ తమ  భర్తలను పిలుస్తున్నారు భార్యలు. నాటి తరంలో ఏవండి అనే ఒక్క పేరు తప్ప భర్తలను భార్యలు పిలిచేందుకు మరో పేరు ఉండేది కాదు. కానీ నేటి తరంలో మాత్రం అబ్బో భర్తలను  భార్యలు  పిలిచే పేరు చెబితే ఓ రోజు అయినా సరిపోదు. అన్ని రకాల పేర్లతో పిలుచుకుంటూ  ఉంటారు. భర్తను పేరుపెట్టి పిలిచే వారు కొందరైతే.... బుజ్జి బంగారం అంటూ ఆప్యాయంగా పిలిచే భార్యలు  ఇంకొంతమంది... అంతేకాదండోయ్ ఏరా, ఒరేయ్ అని భర్తను పిలిచే భార్యలు కూడా లేకపోలేదు. శఇలా  భిన్నమైన పేర్లతో నేటితరం భార్యలను  తమ తమ భర్తలను పిలుచుకుంటున్నారు. 

 


 ఈనాటి కుటుంబంలో భర్తను భార్య పిలిచే పిలుపులో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ముద్దు పేరు పెట్టుకుని పిలుచుకుంటూ  ఉంటారు. ఎన్ని ముద్దు పేర్లు  పెట్టి పిలిచినా ప్రేమ మాత్రం ఒక్కటే కదా. భార్యభర్తల మధ్య అన్యోన్యం అందం ఒక్కటే కదా. అయితే భార్య భర్తల మధ్య అనుబంధం మరింత అన్యోన్యంగా మారాలి అంటే ఒకరినొకరు పిలుచుకునే పేర్లలో కూడా ముడిపడి ఉంటుంది. ఒకరికి ఒకరు ఎంత గౌరవం ఇచ్చుకుని ప్రేమతో పిలుచుకుంటూ ఉంటే  వారిద్దరి మధ్య ఉండే  అనుబంధం బలపడుతూ  ఉంటుంది. అయితే నేటి తరంలో భర్తలను భార్యలు పిలిచే పేర్లలో ఎన్నో మార్పులు వచ్చినప్పటికీ.... నాటి తరం ఏవండి అనే పదానికి మాత్రం ఏదో తెలియని ప్రత్యేకత ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: