భవిష్యత్ అవసరాల కోసం పొదుపు తప్పనిసరి. కానీ ఈ పొదుపు ఎలా చేయాలన్నది చాలా మందికి అవగాహన ఉండదు. తక్కువ మొత్తం పొదుపు చేసి కోటి రూపాయలు సంపాదించడం ఎలాగో తెలుసుకుందాం..

 

 

స్థిరమైన వడ్డీ, స్థిరమైన పొదుపుకు పీపీఎఫ్ ఎకౌంట్ ఓ చక్కటి మార్గం. పీపీఎఫ్ లో పొదుపు చేస్తే సుమారు 8 శాతం వడ్డీ లభిస్తుంది. దీన్నిఏటా తిరగగట్టి లెక్కిస్తారు కాబట్టి.. మీరు చక్రవడ్డీ లభిస్తుంది. మీరు కోటి రూపాయలు సంపాదించాలంటే ఎంత కాలం పడుతుందో చూద్దాం.

 

 

పొదుపు ఎప్పుడూ చిన్న వయస్సులో ప్రారంభిస్తే.. తక్కువ మొత్తంతోనే ఎక్కువ సంపాదించొచ్చు. ఉదాహరణకు 25 ఏళ్ల వయస్సులో పీపీఎఫ్‌ లో నెల నెలా 5000 రూపాయలు పొదుపు చేస్తే.. 35 ఏళ్లలో కోటి రూపాయలు మీ ఖాతాలో జమ అవుతాయి.

 

 

అదే మీ వయస్సు 30 ఏళ్లు అనుకుందాం. అప్పుడు మీరు నెలనెలా రూ. 7200 పొదుపు చేయాల్సి ఉంటుంది. ఇలా 30ఏళ్లు పొదుపు చేస్తే మీరు కోటి రూపాయలు రిటర్న్స్ పొదగలుగుతారు. చూశారా తక్కువ వయస్సులో పొదుపు ప్రారంభిస్తే అంత ఉపయోగం ఉంటుందన్నమాట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: