అగ్ర రాజ్యం అమెరికా అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన దేశమని అందరికి తెలిసిందే. ఎంతగా అభివృద్ధి చెందిన దేశమంటే అక్కడ కొందరు యువతులు సినిమాల్లో యాక్ట్ చేసినంత ఈజీగా  పోర్న్ సైట్స్ లలో డబ్బుల కోసం నటించేస్తున్నారట. అక్కడ అభివృద్ధి ఎంతగా విస్తరించిందో అక్రమ నేరాలు కూడా అంతగానే విస్తరిస్తున్నాయి. తాజాగా వెలుగు చూసిన ఓ సంఘటన ఇప్పుడు అక్కడ కలకలం సృష్టిస్తోంది.

 

అమెరికాలోని శాండియాగోలోని ఓ పోర్న్ గ్రఫీ వెబ్ సైట్ బహిరంగంగా ఓ యాడ్ చేసింది. ఆ యాడ్ సారాంశం ఏమిటంటే. మాకు కొంతమంది యువతులు కావాలి , మేము వాళ్ళతో  పోర్న్ గ్రఫీ చేయిస్తాము, అయితే వారికి చెందిన ఎటువంటి ఫోటోలు వీడియోలో వెబ్ సైట్ లో పెట్టము, అమెరికాలో కాకుండా కొన్ని దేశాలలో ఉన్న కొందరు వ్యక్తులకి మాత్రమే ఇవి చూపిస్తామని  అని యాడ్ లో తెలిపింది. అంతేకాదు ఇందులో పాల్గొన్న మహిళలకి  డబ్బులు పెద్ద ఎత్తున ఇస్తామని చెప్పడంతో

 

చాలా మంది మహిళలు సదరు వెబ్ సైట్ నందు నటించడానికి క్యూ కట్టారు. దాంతో వచ్చిన వాళ్ళందరిని ఫోటోలు వీడియోలు తీసి అనుకున్న ప్రకారం డబ్బులు ముట్టజెప్పి పంపింది.కొన్ని రోజుల తరువాత ఆ వెబ్ సైట్ లో ఓ మహిళకి చెందిన వీడియో బయటకి రావడంతో షాక్ అయిన సదరు మహిళ సైట్ వారిని నిలదీసింది. రూల్స్ బ్రేక్ చేశారని గొడవ పెట్టుకుంది. అదేదో పొరబాటున జరిగిందంటూ సర్ది చెప్పి పంపేశారు.

 

కొన్ని రోజుల తరువాత ఆ సైట్ కోసం నటించిన మొత్తం 22 మంది మహిళల వీడియోలు వెబ్ సైట్ లో ప్రత్యక్షమవ్వడంతో అందరూ వెళ్లి  గొడవపడ్డారు, మేము చేసేది ఏమి లేదూ అంటూ చేతులు ఎత్తేసింది వెబ్ సైట్ యాజమన్యం దాంతో ఆ మహిళలు అందరూ కోర్టుని ఆశ్రయించగా కోర్టు వెంటనే ఆ వీడియోలు డిలీట్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేయడమే కాకుండా ఒక్కో మహిళకి 4 కోట్లు పైగా నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: