అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్ కి గట్టి హెచ్చరిక చేశారు. ఇరాన్ లోని అమెరికా రాయబార కార్యాలయం, వైమానిక స్థావరాలపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. ఇరాన్ పై ప్రతీకారం తీర్చుకోవడానికి మాకు నిమిషం పట్టదు. మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయద్దు, అంటూ ఘాటుగానే స్పందించారు. అంతేకాదు ఇంకొక సారి ఇలాంటి దాడులు జరిగితే ఇరాన్ లో ప్రఖ్యాత ప్రాంతాలన్నిటినీ నేలమట్టం చేస్తామంటూ 52 ముఖ్య ప్రాంతాలని లక్ష్యంగా చేసుకున్నామని వెల్లడించారు.

 

నిన్నటి రోజున చనిపోయిన ఇరాన్ మేయర్ జనరల్ సులేమానీ హత్యని ట్రంప్ సమర్ధించుకున్నారు. ఎంతో మంది అమెరికన్స్ పై సులేమాన్ దాడి చేశారని, ఎంతో మందిని పొట్టన పెట్టుకున్నారని అలంటి వాళ్లకి చావు సరైన శిక్షని అన్నారు. అంతేకాదు ఇరాన్ లో నిరసన కారులని సైతం చంపారని తాము విధించింది సరైన శిక్ష ని ప్రకటించారు. కాగా తాజాగా అమెరికా కార్యాలయం పై దాడికి ఆదేశించారని , కొంతమంది అధికారులపై కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.

 

 

ఇదిలాఉంటే అమెరికా బలగాలు మోహరించిన ప్రాంతంలో రెండు అత్యంత శక్తివంతమైన రాకెట్లు పడ్డాయి. అలాగే బాగ్దాద్ లో అమెరికా కార్యాలయం ఉన్న గ్రీన్ జోన్ ప్రాంతంలో రెండు రాకెట్లు పడ్డాయి. వీటివల్ల ఎలాంటి నష్టం జరిగింది అమెరికాకి అనేది లెక్కలు తెలియలేదు. మా దాడులు మరిన్ని ఉంటాయని ఇరాన్ హెచ్చరించిన నేపధ్యంలో ట్రంప్ బదులుగా ఇలాంటి వ్యాఖ్యలు చేశారని, ట్రంప్ హెచ్చరికతో ఇరాన్ వెనక్కి తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నయాని అంటున్నారు నిపుణులు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: