సూర్యోద‌యాలు అంటే.. నేటి యువ‌త‌కు ఓ మిస్ట‌రీ! సూర్యోద‌యానికి ముందు నిద్ర‌లేచే సంస్కృతి ఉన్న ఈ దేశంలో సూర్యోద‌యం మాటే ఎరుగ‌ని యువ‌త 80శాతం మంది ఉన్నార‌ని ఇటీవ‌ల ఓ స‌ర్వే స్ప‌ష్టం చేసింది. అర్ధ‌రాత్రి దాటిపోయి.. తెల్ల‌వారు జాము వ‌చ్చే వ‌ర‌కు రోడ్ల పై తిరుగుతూ.. ఫ్రెండ్స్‌తో పార్టీలో మునిగి తేలుతున్న యువ‌త తెల‌తెల‌వారుతూ ప‌క్క‌మీద‌కు చేరి.. మిట్ట‌మ‌ధ్యాహ్నం వ‌ర‌కు ప‌రుపు దిగ‌డం లేదు. లేట్ నైట్ పార్టీలు, ప‌బ్‌లు ఇవ‌న్నీ కామన్ అయిపోయాయి ఈ రోజుల్లో. నైట్ పార్టీలు ఉద‌యం లేట్‌గా లేవ‌డం మ‌ధ్యాహ్నం లేచి అప్పుడు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకుని తిన‌డం ఇవ‌న్నీ ఎక్కువ‌యిపోయాయి నేటి యువ‌త‌కి. ఇలాంటి ట్రెండ్ నేటి ట్రెండ్ గా మారిపోయింది. ఇది ఎక్కువ‌గా పోష్ ఫ్యామిలీల్లో క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

 

ఇదివ‌ర‌క‌టి రోజుల్లో ఉద‌యాన్నే లేవ‌డం చ‌క్క‌గా అన్ని ప‌నులు చేసుకోవ‌డం. సాయంత్రం త్వ‌ర‌గా ప‌డుకోవ‌డం ఇలా ఉండేది. అలాగే ఇప్పుడు సాఫ్ట్‌వేర్ జాబ్‌లు కూడా అలాగే ఉంటున్నాయి. నైట్ జాబ్‌లు తెల్ల‌వారు రావ‌డం చాలా కామ‌న్ అయిపోయింది. నైట్ జాబులు తెల్ల‌వారు రావ‌డాలు ఎప్పుడో లేవ‌డం ఇలాంటివ‌న్నీ సిటీల్లో చాలా కామ‌న్ ఇంక ఇలాంటి వ‌న్నీ కామ‌న్‌.

 

మరింత సమాచారం తెలుసుకోండి: