నాటి తరంలో చదువుకునే వాళ్ళందరూ స్తోమతను బట్టి ఖర్చుల పెట్టుకునే వారు.. కానీ నేటి తరం యువత మాత్రం ఆర్థిక స్తోమత ఎలా ఉన్న... కుటుంబ పరిస్థితి ఎక్కడ ఉన్న వారికి మాత్రం స్థోమతకు మించిన ఖర్చులు కావాల్సిందే. పెద్ద పెద్ద బైకులు, బ్రాండెడ్ బట్టలు ఇలాంటి వాటిలో ఒకటి తక్కువైనా నాన్న విలన్ లాగా కనిపిస్తూ ఉంటాడు ఈతరం యువత కి. మా నాన్న మా కోసం ఏమి చేయరు మిగతా నాన్నలు ఎంత బాగా చేస్తున్నారో అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. చిన్న అవసరాలకు కూడా భారీ మొత్తంలో నాన్న దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు. ఒకప్పుడు నాన్న అంటే ఎంతో గౌరవం ఉండేది. నన్ను ముందు నిలబడి మాట్లాడాలి అంటేనే వనికి పోయే వారు . 

 

 

కానీ ఈ రోజుల్లో  ఇప్పుడు మాత్రం నాన్నంటే కాస్తయినా గౌరవం లేకుండా పోయింది. నాన్న ముందు నిలబడి మాట్లాడడం ఏంటి... డబ్బులు కావాలంటే నాన్నను  నిలదీసి మరి అడుగుతున్నారు. ప్రస్తుతం నాన్న అంటే మనకు నడక నేర్పించి మన కష్టాలను తన కష్టాలుగా  భావించి మన కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి కాదు... నాన్న అంటే కేవలం అవసరాలు తీర్చే ఏటీఎం మాత్రమే అని అనుకుంటున్నారు నేటితరం యువత. తమ అవసరాల కోసం డబ్బులు ఇస్తే మా నాన్న చాలా మంచోడు అంటారు.. డబ్బులు లేవు రా ఇంట్లో పరిస్థితి బాగాలేదు అని చెబితే మా నాన్నంత  చెడ్డ వారు మరొకరు లేరు అని చెబుతుంటారు. నేటి సమాజంలో ప్రతి చోటా ఇలాంటివి జరుగుతున్నాయి.

 

 

 దీంతో నాటి తరం అనుబంధాలు పోయి కేవలం మని  బంధాలు మాత్రమే మిగిలి పోతున్నాయి. మనీ ఇస్తే బంధాలు మెరుగు పడుతున్నాయి మనీ లేకపోతే బంధాలు తెగిపోతున్నాయి . అలాంటి ఆలోచనలు ఉంది నేటితరం యువతలో . నేటితరం యువత ఆలోచనా తీరు ఇలా ఉంటే రేపటి తరం యువత  ఆలోచనా తీరు ఎలా ఉంటుందో ఆలోచిస్తేనే భయం వేస్తూ ఉంటుంది. కేవలం నాన్న ఉన్నది మన అవసరాలు తీర్చడానికి అనుకుంటున్నారు ఈతరం యువత. నాన్న అంటే ఒక ఏటీఎం మాత్రమే.. ఎప్పుడు అడిగినా డబ్బులు ఇస్తూ ఉంటారు... అని అనుకుంటారు. నాన్న అంటే మనకు జన్మనిచ్చిన గొప్ప వ్యక్తి అని గౌరవించే వాళ్ళు చాలా తక్కువమందే కనిపిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: