తల్లిదండ్రులతో చెప్పుకోలేని కొన్ని విషయాలను ఫ్రెండ్స్‌తోనే షేర్‌ చేసుకుంటాం. అంతటి గొప్ప నమ్మకం స్నేహం. ఇక అదృష్టమో, దురదృ ష్టమో ఓ మ‌నిషికి అపూర్వ‌మైన బంధం ఫ్రెండ్ షిప్‌. కష్టాన్ని ఫ్రెండ్‌తో చెప్పినప్పుడు మనసు తేలికవుతుంది. అలాగే ఎక్కువ‌గా చిన్న నాటి స్నేహితుల ను ఎన్నటికీ మ‌ర్చిపోరు కొంద‌రు. బంధువులు మనం మంచిగా ఉన్నప్పుడే దరిచేరతారు. వారిలో మన సమస్యలను విని పరిష్కరించే వారు కొందరే ఉంటారు. కానీ నిజమైన స్నేహితులు మనం సమ స్యల్లో ఉన్నప్పుడు కూడా వెంటే ఉంటారు. వెన్నుదన్నుగా ఉండి సమస్యకు పరిష్కార మార్గం చూపుతారు. అందుకేనేమో అన్ని బంధాల్లోకెల్లా స్నేహ బంధం గొప్పది.

 

ఇక నేటి యువ‌త కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి గ‌డుపుతున్న కాలం కంటే కూడా మంచో చెడో స్నేహాల‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. నాలుగు రోడ్ల కూడ‌లిలో ఉంటే టీ కొట్టు ద‌గ్గ‌ర చూసినా.. సాయంత్రం 8 త‌ర్వాత బార్‌లో వెతికినా.. ఇలాంటి వారే ద‌ర్శ‌న‌మిస్తుంటారు. వాళ్ల‌కు కుటుంబాలు, బంధువులు, బంధుత్వాల కంటే ఫ్రెండ్సే ముద్దు అనేకునే విధంగా మారుతున్నారు. అయితే ఫ్రెండ్ షిప్ అంతే చేతికి వేసే బ్యాండ్ కాదు.. జీవితాంతం గుర్తుంచుకునే బాండ్ లాంటిది.

 

మ‌రో విష‌యం ఏంటంటే..  విద్యార్థులు ఎక్కువ సమయం వారి ఫ్రెండ్స్‌తోనే గడుపుతుంటారు. కొన్ని అధ్యయనాల ప్రకారం వారంలో వారు క్లాసులకి కేటాయించే సమయం కేవలం 15 గంటలు మాత్రమే. మిగతా 86 గంటలు వారి స్నేహితులతోనే కాలక్షేపం చేస్తారట. ఏదేమైనా.. స్నేహం అంటే..వన్ బై టూ చాయ్ లే కాదు. సగం సగం తాగే కింగ్ సైజ్ సిగరేట్ కాదు. అదో అనిర్వచనీయ బంధం. హృదయానికి సంబంధించిన ఫీలింగ్.. చచ్చే వరకు , చావు తర్వాత కూడా నీ వెంట ఉండే ఓ బలమైన బంధం స్నేహం అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: