పెళ్లంటే.. వివరించడానికి మాటలు రావనిచెప్పలి..పెళ్ళిననేది రెండు మనుషులు మద్య ఓ బంధాన్ని కలిగించి వేదమంత్రాలు నడుమ..మంగళ వాయిద్యాల నడుమ బంధుమిత్రుల మధ్య ఆకాశమంత పందిరిలో చేసుకొనే ఒక అద్భుత ఘట్టం.. పెల్లేనది.. నూరేళ్ల పంట.. దేవుడు ఎవరికి రాసిపెట్టి ఉంటే వారికి జరుగుతుంది అని పెద్దలు కూడా అంటారు.. అందుకేనేమో కక్కు వచ్చిన కల్యణమొచ్చిన ఆగదంటారు. 

 

భారతీయ పెళ్లిళ్లు అంటే ఇంకా చెప్పనక్కర్లేదు.. ఒక నెల నుండి హడావిడి మామూలుగా ఉండదు.. ఆకాశమంత. పందిరి వేసి భూదేవి అంత ఆరిటాకు వేసి వచ్చిన బందువులు పదిరోజుల వరకు మర్చిపోకుండా చేస్తుంది.. అందుకే పెళ్లి అనే మాట జీవితంలో ఒక్కసారే జరుగుతుంది.. ఈ మధ్య ఈ పెళ్లి తంతు ఆచారాలు కూడా పూర్తిగా మారిపోయింది.. కాలం మారినా కొద్ది ఆచారాలు కూడా కనుమరుగయ్యాయి .

 

ఇంకా బంధువుల గురించి చెప్పనక్క్లేదు.. ఒకప్పుడు ఎంత బిజీగా ఉన్నా వచ్చి నాలుగు అక్షంతలు వేసి ఆశీర్వదించే వారు ఇప్పుడు అది పూర్తిగా వ్యతిరేకమని చెప్పాలి.. పెళ్లి అని పనికట్టుకుని ఎక్కడో ఉన్నా వాళ్లకు చెప్పి వెళితే కానిసం రావడం మాట పక్కన పెడితే ఫోన్లో అస్వీర్వదం అక్షంతలు కూడా అయిపోతున్నాయి అంటే నమ్మండి.. భారత దేశం అభివృద్ధి చెందిందని  సంతోష పడాలా లేకా ఆచారాలు మంట కలిసాయని భాదపడాలో అర్థం కావడం లేదు..

 

పెళ్లి పిలుపు వచ్చిదంటే ఒకప్పుడు ఊరు మొత్తం వారాం ముందే ఆ పని ఈ పని అంటూ హడావిడి చేసేవాళ్ళు కానీ ఇప్పుడుమాత్రం స్మార్ట్ ఫోన్లకు పరిమితమైంది..టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందిందో.. అంతకు మించి మనుషుల మద్య దూరాలు పెరిగాయి.. అందుకే మొక్కై వంగనిది మానై వంగున అని పెద్దలు ఊరికే అనలేదు.. సినిమాలు ఎంతగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి... అంటే అందులో ఎది ఉంటే అదే జనాలు చేస్తున్నారు.. ఇకపోతే సినిమా వాల్లన్న ఫ్యాషన్ పక్కన పెట్టీ సాంప్రదాయాలు తెలుసుకునేలా తీయ్యాలని అందరూ అనుకుంటున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: